
Keerthy Suresh: పెళ్లైన నాలుగు నెలలకే గుడ్ న్యూస్... కీర్తి సురేశ్ నుంచి బిగ్ సర్‌ప్రైజ్?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కాలంలో నటి కీర్తి సురేష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
కేవలం కొన్ని సంవత్సరాల్లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోలతో కలిసి నటిస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.
కీర్తి సురేశ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం 'మహానటి'. ఈ బయోపిక్‌లో సావిత్రి పాత్రలో నటించిన ఆమెకు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఆమెలో అభినయ నైపుణ్యాన్ని అందరూ గుర్తించారు.
ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటి అనే పేరును కూడా ఈ సినిమాతోనే సంపాదించారు. అలాగని, ఇటీవల కాలంలో కీర్తికి పెద్దగా హిట్లు వచ్చినట్లు లేదు.
Details
ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి
కానీ కెరీర్ పరంగా మాత్రం ఆమె ముందుకు సాగుతూనే ఉన్నారు. గతంలో కీర్తి ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేదా రొమాంటిక్ సీన్స్ చేయలేదు.
అయితే నేటి ట్రెండ్ మారిపోతున్న నేపథ్యంలో, కీర్తి సురేశ్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.
అదే సమయంలో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన కీర్తి, గతేడాది హీరో వరుణ్ ధావన్‌తో కలిసి 'బేబీ జాన్' అనే హిందీ సినిమాలో నటించారు.
ఇందులో తన గ్లామర్‌ను ఓ రేంజ్‌లో ప్రదర్శించినప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
గతేడాది కీర్తి సురేశ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన 15 ఏళ్ల ప్రేమను పెళ్లిగా మార్చుకుని, మహానటి నిజ జీవితంలోనూ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
Details
స్పందించని కీర్తి సురేష్
కాలేజ్ డేస్ నుంచే ప్రేమలో ఉన్న కీర్తి, సినీ రంగంలోకి వచ్చాక కూడా ఆ ప్రేమను కొనసాగించి, చివరకు తన ప్రియుడు ఆంటోనితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ మరింత ఎనర్జీతో కనిపిస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ, ఫుల్ బిజీగా మారారు.
అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తరచూ తన ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్ మతిపోగొడుతున్నారు.
తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటోషూట్‌లో కాస్తా పొట్ట భాగం ఎత్తుగా కనిపించడంతో, ఆమె గర్భవతినై ఉండొచ్చని అభిమానులు గుసగుసలాడుతున్నారు.
కొందరు సోషల్ మీడియాలో "కీర్తి ప్రెగ్నెంట్ అయిందా?" అంటూ ప్రశ్నిస్తే, మరికొందరు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు