కేజీఎఫ్ కాంట్రవర్సీ: వెంకటేష్ మహాకు క్లాస్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్
ఈ వార్తాకథనం ఏంటి
కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా, కేజీఎఫ్ సినిమాపై మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో అతని మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
తను మాట్లాడిన భాష కరెక్ట్ కాదంటూ సారీ చెప్పిన కూడా ట్రోలింగ్ ఇంకా జరుగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో కమర్షియల్ సినిమాల గురించి హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
బలగం సినిమా విజయోత్సవ వేడుకకు వచ్చిన హరీష్ శంకర్, సినిమాను కమర్షియల్ అని, క్లాసిక్ అని మనమే విభజిస్తున్నామని.. సినిమా వాళ్లకు బయట చాలా ఇష్యూస్ ఉన్నాయని, ఓటీటీతో పోటీ, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వచ్చే వాళ్లతో డీలింగ్, ఇవన్నీ ఉండగా మనలో మనమే డివిజన్స్ క్రియేట్ చేసుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు.
కేజీఎఫ్ కాంట్రవర్సీ
సైకిల్ ఎగ్జాంపుల్ తో సరిగ్గా వివరించిన హరీష్ శంకర్
అయితే ఇక్కడ వెంకటేష్ మహా పేరును ప్రస్తావించలేదు, కానీ ఆయన స్పీచ్ మాత్రం వెంకటేష్ మహా, ఇంకా సినిమాను కమర్షియల్, క్లాసిక్ అంటూ విడదీసే వాళ్లకు తగిలే విధంగా ఉంది.
ఆయన మాట్లాడుతూ, ఒకతనికి రోడ్డు మీద సైకిల్ తో వెళ్ళటం ఇష్టం. చల్లగా తగిలే గాలిని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్తారు. ఇంకొందరేమో ఏసీ కారులో మ్యూజిక్ ఆన్ చేసుకొని స్పీడ్ గా వెళ్తుంటారు.
ఇక్కడ మనం సైకిల్ పై వెళ్ళేవాళ్ళని కారులో ఎందుకు వెళ్లట్లేదని అడిగితే ఎలా ఉంటుంది. సినిమా కూడా అంతే, ఎవరికి నచ్చింది వారు చూస్తారని, బిర్యానీ తినే వాళ్ళు బిర్యానీ తింటారనీ పెరుగన్నం తినేవాళ్ళు పెరుగన్నం తింటారని అన్నాడు హరీష్ శంకర్.