కేజీఎఫ్ కాంట్రవర్సీ: నవ్విన దర్శకులందరికీ తన మాటలతో పంచ్ ఇచ్చిన నాని
ఈ వార్తాకథనం ఏంటి
కేజీఎఫ్ సినిమా మీద అనేక కామెంట్లు చేసిన వెంకటేష్ మహా మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలోని క్యారెక్టర్ గురించి వెంకటేష్ మహా మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న ఇంద్రగంటి మోహనకృష్ణ, నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ విరగబడి నవ్వారు.
దాంతో వారిమీద కూడా ట్రోలింగ్ జరిగింది. కమర్షియల్ సినిమా అంటే సినిమానే కాదనీ, అవన్నీ పాప్ కార్న్ సినిమాలనీ వెంకటేష్ మహా మాట్లాడాడు.
ప్రస్తుతం నవ్విన దర్శకులందరికీ నేచురల్ స్టార్ నాని, తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడు. బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన నాని, కమర్షియల్ సినిమాల వల్లే జనాలు థియేటర్ కు వస్తారనీ, నిర్మాతల జేబులు నింపేది కమర్షియల్ సినిమాలేననీ నాని అన్నాడు.
దసరా
సెన్సిబుల్ డైరెక్టర్లు సెన్స్ తో ప్రవర్తించాలంటూ కామెంట్లు
నాని చెప్పిన సమాధానం, కమర్షియల్ గురించి తక్కువ చేసిన నవ్విన వాళ్ళ గురించేననీ, సోషల్ మీడియాలో వరుస పోస్టులు పడుతున్నాయి.
దర్శకులుగా ఒక స్థానంలో ఉండి, ఇతర దర్శకుల పనిని విమర్శించడం సరైన పని కాదనీ, సెన్సిబుల్ దర్శకులనుకున్న వారే ఇలా సెన్స్ లేకుండా ప్రవర్తించడం సబబు కాదనీ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
అదలా ఉంచితే, ప్రస్తుతం దసరా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు నాని. మొన్నటికి మొన్న దసరా నుండి ఛమ్కీల అంగీలేసి పాటను రిలీజ్ చేసారు. ఈ పాటకు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది.
పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న దసరా, మార్చ్ 30వ తేదీన థియేటర్లలోకి రానుంది.