"నిజం విత్ స్మిత " షో లో నాని వారసత్వంపై చేసిన కామెంట్స్ వైరల్
నేచురల్ స్టార్ నాని, హీరో రానా దగ్గుబాటితో నిజం విత్ స్మిత షో పాల్గొన్నారు. ఈ మధ్యే నటుడి ఎపిసోడ్ ప్రోమోను ఓటీటీ ప్లాట్‌ఫాం సోనిలివ్ లో విడుదల చేశారు. ఆ షోలో, నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, వీటిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నాని మొదటి చిత్రాన్ని లక్ష మంది చూశారని, రామ్ చరణ్ మొదటి చిత్రం కోటి మంది చూశారని అన్నారు నాని. సినిమాలను చూడటం ద్వారా వారసత్వాన్ని ప్రోత్సహించేది ప్రేక్షకులు అని నాని కామెంట్ చేశారు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ కాదు, పరిశ్రమలో ఇటువంటి ధోరణి ఉందని ప్రజలు చెప్పినప్పుడు తనకు అర్థం కాలేదని నాని పేర్కొన్నారు.
నిజం విత్ స్మిత షోలో నాని చేసిన కామెంట్స్ వైరల్
షో హోస్ట్ స్మిత నాని మాటలు తపుగా అర్దం చేసుకోవద్దు అన్నారు
అయితే ఈ క్రమంలో నాని మాటలు చాలామంది తప్పుగా అర్ధం చేసుకున్నారు. మరికొందరు అయితే అప్పుడే నానిపై ట్రోలింగ్ ప్రారంభించారు.ఆ షో హోస్ట్ స్మిత రంగంలోకి దిగి, నాని అన్న మాటలపై మాట్లాడుతూ, ప్రేక్షకులు చేస్తున్నది తప్పు అని నాని ఎప్పుడూ చెప్పలేదు, ఏమి జరుగుతుందో చెప్పారని దీనిని వివాదంగా చేయవలసిన అవసరం లేదని అన్నారు.