
నాని బర్త్ డే: కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలు
ఈ వార్తాకథనం ఏంటి
నాని.. ఇంట్లో కుర్రాడిలా ఉంటాడు, అందుకే ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగాడు, అందుకే కుర్రాళ్ళకు ఆయనంటే అభిమానం ఎక్కువ.
పక్కింటి కుర్రాడు, కుర్రాళ్ళకు ఇన్సిపిరేషన్ అయిన నాని పుట్టినరోజు ఈరోజు. 2023 ఫిబ్రవరి 24వ తేదీన తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు నాని. ఈ నేపథ్యంలో నాని నటించిన సినిమాల్లోంచి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం.
జెర్సీ (2019): అనారోగ్యం కారణంగా ప్రాణమైన క్రికెట్ ను వదిలేసి, ఆ తర్వాత వేరే పని చేయలేక, కొడుకు కోసం క్రికెట్ జెర్సీ కొనివ్వడానికి డబ్బులేక అవస్థలు పడే తండ్రి కథలో, ప్రేక్షకులకు కన్నీళ్ళు పెట్టించాడు నాని.
నాని
నాని కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు
పిల్ల జమీదాంర్ (2011):
డబ్బుందన్న అహంకారంతో ఎవ్వరి పట్టించుకోని కుర్రాడు, డబ్బులేని పరిస్థితుల్లో పడితే ఎలా ఉంటుందనేది చూపించారు. జి అశోక్, ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈగ (2012):
రాజమౌళి దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని ప్రతీ హీరో అనుకుంటారు. ఆ అవకాశం ఈగ ద్వారా నానికి దక్కింది. పాత్ర నిడివి కొంతే అయినా నాని కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలిచింది.
భలేభలే మగాడివోయ్ (2015):
మారుతి రూపొందించిన ఈ మూవీతో నాని పెద్ద హీరో అయ్యాడని చెప్పాలి. రిలీజైన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అయ్యింది.
దసరా(2023):
మార్చ్ 30న విడుదలయ్యే ఈ సినిమాలో, ఇదివరకెప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తున్నాడు నాని. అదీగాక నాని కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రం.