దసరా ప్రమోషన్లు: చరిత్రలో మొదటిసారిగా 39సెంటర్లలో కౌండ్ డౌన్ బోర్డ్స్
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని, దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పరిచయం కావాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్లు మొదలు పెడుతున్నాడు నాని.
పాట రిలీజ్ కోసం ఫంక్షన్ ఏర్పాటు చేయడం ఈ కోవలోకే వస్తుంది. తాజాగా దసరా టీమ్ సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్ తో వస్తోంది. ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా వినూత్నమైన పద్దతిలో ప్రమోషన్లు మొదలెట్టింది.
దేశంలోని 39సెంటర్లలో దసరా మూవీ కౌంట్ డౌన్ బోర్డులను ఇన్ స్టాల్ చేసింది దసరా టీమ్.
ఇదంతా నాని పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేస్తుండడం విశేషం. 2023 ఫిబ్రవరి 24వ తేదీన తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు నాని.
ఆ నేపథ్యంలో దసరా ప్రమోషన్లకు కొత్త రూపు తీసుకొచ్చింది చిత్రబృందం.
దసరా
సెంటర్ల పేర్లు వెల్లడించని దసరా టీమ్
ఐతే 39సెంటర్లు అని చెప్పారు కానీ వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరి నాని పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా వెల్లడిచేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
దసరా టీజర్ రిలీజై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో నాని చాలా మాస్ గా కనిపించాడు.
ఇంతటి మాస్ సినిమా చేయడం ఇదే మొదటిసారి కూడా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, హీరోయిన్ గా కనిపిస్తుంది.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను, మార్చ్ 30వ తేదీన దసరా మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.