నాని 31: అంటే, వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చేస్తున్నారట?
ఈ వార్తాకథనం ఏంటి
తన మొదటి పాన్ ఇండియా చిత్రం దసరా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చ్ 30వ తేదీన రిలీజ్ అవుతుంది.
అదలా ఉంటే, ప్రస్తుతం నాని చేతిలో ఒక సినిమా ఉంది. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 30వ సినిమాలో సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం నాని తన 31వ సినిమాను ఒప్పుకున్నట్లు వినిపిస్తోంది. అంటే సుందరానికి సినిమా దర్శకుడు వివేక్ అత్రేయ దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట.
అంటే సుందరానికి సినిమాకు బాక్సాఫీసు వద్ద తగినంత గుర్తింపు రాకపోయినప్పటికీ వివేక్ ఆత్రేయకు మరో అవకాశం ఇస్తున్నాడట.
నాని
దసరా రిలీజ్ తర్వాత పట్టాలెక్కనున్న సినిమా
ప్రస్తుతం దసరా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు నాని. మొన్నటికి మొన్న దసరా నుండి ఓరి వారి అంటూ రెండవ పాట రిలీజైంది. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట, అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ పాట రిలీజ్ కోసం ప్రత్యేక ఈవెంట్ ని ఏర్పాటు చేసింది చిత్రబృందం. ప్రేమికుల రోజు సందర్భంగా బ్రేకప్ పాటను రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది దసరా టీమ్.
దసరా టీజర్ కూడా ఆసక్తిగా ఉండడంతో, తన కెరీర్ లో మొదటి పాన్ ఇండియా విజయం అందుకుంటాడని అంచనా వేస్తున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న దసరా సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారయణన్ సంగీతం అందించారు.