
దసరా సెకండ్ సింగిల్: వాలెంటైన్స్ డే కానుకగా బ్రేకప్ సాంగ్
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా నుండి బ్రేకప్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇది ఆ సినిమాలోని రెండవ పాట. ఇప్పటివరకు ధూం ధాం దోస్తాన్ అనే మాస్ సాంగ్ ఒక్కటే రిలీజైంది.
ఓరి వారి అంటూ బ్రేకప్ బాధను తెలియజేసే రెండవ పాటను వాలెంటైన్స్ డేకి ఒకరోజు ముందు రిలీజ్ చేసారు. ఈ పాట రిలీజ్ కోసం కూడా చిన్నపాటి ఈవెంట్ చేసారు.
ఓరి వారి నీది కాదురా పోరి, ఇడిసెయ్ ర ఇంగ ఒడిసెను దారి అంటూ సాగిన పాట, పూర్తిగా తెలంగాణ మాండలికంలో అదికూడా పల్లెటూరి యాసలో ఉంది.
సాధారణంగా మాస్ మసాలా పాటలు తెలంగాణ యాసలో కనిపిస్తాయి. కానీ ఇక్కడ బ్రేకప్ పాట తెలంగాణ యాసలో కనిపించింది.
దసరా
శ్రీమణి లిరిక్స్ తో పాడుకునేలా ఉన్న పాట
ఓరి వారి పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ సమకూర్చారు.
దసరా సినిమాను నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమాపై నానికి చాలా నమ్మకం ఉంది. మొన్న టీజర్ రిలీజ్ లో నాని మాట్లాడిన మాటలు, నిన్న పాట రిలీజ్ లో నానిలో కనిపించిన నమ్మకం.. సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి.
అదే టైమ్ లో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద కొందరిలో అనుమానం కలుగుతోంది. ఆ దర్శకుడి మీద అంత నమ్మకం ఎందుకని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఆగాల్సిందే.
కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న దసరా మూవీ, మార్చ్ 30వ తేదీన రిలీజ్ అవుతుంది.