NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నాని కెరీర్లో ఫస్ట్ సినిమాగా సరికొత్త రికార్డ్ సృష్టించిన దసరా
    తదుపరి వార్తా కథనం
    నాని కెరీర్లో ఫస్ట్ సినిమాగా సరికొత్త రికార్డ్ సృష్టించిన దసరా
    దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న దసరా టీజర్

    నాని కెరీర్లో ఫస్ట్ సినిమాగా సరికొత్త రికార్డ్ సృష్టించిన దసరా

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 01, 2023
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేచురల్ స్టార్ నాని నటించిన దసరా టీజర్ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జనరల్ గా నాని విభిన్నమైన సినిమాలు చేస్తాడని అందరికీ తెలుసు. కానీ ఇలా పూర్తిగా మాస్ పాత్రలో కనిపిస్తారని ప్రేక్షకులు ఊహించలేదు.

    టీజర్ మొత్తం నాని అభిమానులనే కాదు సినిమా అభిమానులకు ఉర్రూతలూగించింది. అదీగాక అందరినీ కట్టిపడేస్తున్న మరో అంశం ఏమిటంటే, టీజర్ రిలీజ్ రోజున నానిలో కనిపించిన కాన్ఫిడెన్స్. ఆ నమ్మకమే దసరా సినిమా మీద అంచనాలను పెంచేసింది.

    2022లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ అయితే 2023లో దసరా అని చెప్పడం, దసరా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుండడం, ప్రస్తుతం టీజర్ కి దేశవ్యాప్తంగా వస్తున రెస్పాన్స్.. ఇవన్నీ చూస్తుంటే నాని గట్టిగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

    నాని దసరా

    24గంటల్లో 13మిలియన్లు దాటేసిన దసరా టీజర్

    దసరా టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. తెలుగులో మొదటి స్థానంలో, తమిళంలో 2వ స్థానంలో, మళయాలంలో ఆరు, హిందీలో 8వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

    మొత్తంగా టీజర్ రిలీజ్ అయిన 24గంటల్లోనే 13మిలియన్ల వ్యూస్ రాబట్టింది దసరా టీజర్. నాని కెరీర్లో ఒకరోజులో అత్యధిక వ్యూస్ అందుకున్న టీజర్ గా రికార్డ్ నెలకొల్పింది.

    టీజర్ తోనే ఊపేసిన నాని, ట్రైలర్ తో సెగ పుట్టించేలా ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. దసరా మూవీ మార్చ్ 30వ తేదీన విడుదల అవుతుంది.

    ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    తెలుగు సినిమా

    జబర్దస్త్: పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కి కిర్రాక్ ఆర్పీ సాయం సినిమా
    వాల్తేరు వీరయ్య ట్విట్టర్ రివ్యూ: చిరంజీవి అభిమానులకు పూనకాలు వాల్తేరు వీరయ్య
    మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటున్న మంచు లక్ష్మీ వీరసింహారెడ్డి
    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025