NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం
    తదుపరి వార్తా కథనం
    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం
    దసరా టీజర్ లో కరడుగట్టిన మాస్ పాత్రలో కనిపించిన నాని

    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 30, 2023
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం దసరా టీజర్ ఇంతకుముందే రిలీజైంది. ఇదివరకు సినిమాల్లో నాని చేసిన పాత్రలన్నీ దాదాపుగా సాఫ్ట్ నేచర్ కలిగి ఉన్నవే. కృష్ణార్జున యుద్ధంలో ఒక పాత్రలో మాస్ గా కనిపించాడు గానీ అది కూడా పూర్తి మాస్ కాదు.

    కానీ దసరా టీజర్ లో నాని కొత్త అవతారంలో కనిపించాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో దసరా టీజర్ రిలీజైంది. తెలుగులో రాజమౌళి, హిందీలో షాహిద్ కపూర్, మళయాలంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి, తమిళంలో ధనుష్ విడుదల చేసారు.

    టీజర్ ఆద్యంతం పూర్తి మాస్ అంశాలతో నిండి ఉంది. చేతిలో మందుసీసా, నోట్లో బీడీతో కరడుగట్టిన మాస్ పాత్రలో కనిపించాడు నాని.

    దసరా టీజర్

    మందు తాగడం సాంప్రదాయమని చెప్పిన నాని

    దసరా టీజర్ లో నాని పాత్ర, తానుండే ఊరును పరిచయం చేస్తూ, బొగ్గు కుప్పల చాటున ఉండే చిన్న ఊరు వీర్లపల్లి తమ ఊరని, ఇక్కడ మందు తాగడం వ్యసనం కాదని, అలవాటుగా మారిన సాంప్రదాయమని చెబుతాడు.

    టీజర్ చివర్లో కత్తిని నోట్లో పెట్టుకుని తనే వీరతిలకం దిద్దుకోవడం మాస్ అనే పదానికి పరాకాష్ఠగా నిలిచింది. సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ బాగుంది.

    టీజర్ తోనే దసరా సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఐతే ఈ టీజర్ లో హీరోయిన్ కీర్తి సురేష్ ఎక్కడా కనిపించలేదు.

    ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం, 2023 మార్చ్ 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    ట్రైలర్ టాక్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    తెలుగు సినిమా

    వారిసు ట్విట్టర్ రివ్యూ: పాజిటివ్ ప్రశంసలతో నిండిపోతున్న సోషల్ మీడియా, కానీ సినిమా
    కేజీఎఫ్ హీరోయిన్ కి తెలుగులో అవకాశం, సీనియర్ హీరో సరసన? సినిమా
    వీరసింహారెడ్డి: అమెరికాలో హాఫ్ మిలియన్ దాటేసిన కలెక్షన్లు వీరసింహారెడ్డి
    వీరసింహారెడ్డి రివ్యూ: బాలయ్య అభిమానులకు పండగే వీరసింహారెడ్డి

    ట్రైలర్ టాక్

    బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ తెలుగు సినిమా
    భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025