ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్
ఆర్ఆర్ఆర్ సినిమా ఆశలు ఫలించాయి. ఆస్కార్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కింది. ప్రతీ సినిమా కళాకారుడు కలలు గనే ఆస్కార్ అవార్డు గుమ్మం ముందు ఆర్ఆర్ఆర్ నిల్చుంది. ఉత్తమ పాట విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లో నిలిచింది. నాటు నాటు పాటతో పాటు హోల్డ్ మై హ్యాండ్, లిఫ్ట్ మి అప్, థిస్ ఈజ్ లైఫ్, అప్లాజ్ అనే పాటలు నామినేషన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు అందరూ సంతోషంగా ఉన్నారు. భారతదేశం నుండి ఉత్తమ పాట విభాగంలో నామినేట్ అయిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలవడంతో దేశమంతా గర్వంగా ఉంది. ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ ఒక్క విషయంలో ఆర్ఆర్ఆర్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.
ఆర్ఆర్ఆర్ సినిమాను కాకుండా గుజరాతీ మూవీని సెలెక్ట్ చేసిన ఇండియన్ ఫిలిమ్
ఆర్ఆర్ఆర్ సినిమాకు పశ్చిమ దేశాల్లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్లలోంచి సినిమా వెళ్ళిపోయిన తర్వాత కూడా "ఎన్ కోర్" ల రూపంలో మళ్ళీ మళ్ళీ సినిమా వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలందుకుంటున్న ఆర్ఆర్ఆర్ సినిమాను ఇండియన్ ఫిలిమ్ ఫెడరేషన్ గుర్తించలేదని ఆర్ఆర్ఆర్ అభిమానులు నిరాశ పడుతున్నారు. ఆస్కార్ అవార్డుల్లోని ఇంటర్నేషనల్ ఫీఛర్ ఫిలిమ్ విభాగానికి ఇండియా తరపున గుజరాతీ ఫిలిమ్ "ఛెల్లో షో" ను పంపారు. ఆ సినిమా షార్ట్ లిస్ట్ లో నిలిచింది కానీ, నామినేట్ అవలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఇండియా తరపున పంపిస్తే, ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫీఛర్ ఫిలిమ్ విభాగంలో నామినేట్ అయ్యుండేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.