
సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ భారతీయులను ఆకట్టుకున్నాయి. ఆర్ఆర్ఆర్ నుండి రెండు నామినేషన్లు ఉండడం దీనికి కారణం.
ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ ఒడిసి పట్టుకున్న వారి వివరాలు తెలుసుకుందాం.
ఉత్తమ దర్శకుడిగా ఫేబుల్ మ్యాన్స్ అనే సినిమాకు స్టీవెన్ స్పీల్ బర్గ్ అవార్డ్ అందుకున్నాడు. అలాగే ఉత్తమ చిత్రం (డ్రామా) విభాగంలో అవార్డు అందుకుంది ఫేబుల్ మ్యాన్స్.
ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో "ద బాన్ షీస్ ఆఫ్ ఇన్షిరీన్" అనే సినిమాకు అవార్డ్ అందుకున్నాడు మార్టిన్ మాక్డో. అలాగే మ్యూజికల్/కామెడీ విభాగంలో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది ద బాన్ షీస్ ఆఫ్ ఇన్షిరీన్.
ఉత్తమ నటుడిగా ఎల్విస్ (డ్రామా) సినిమాకు గాను అవార్డ్ అందుకున్నాడు ఆస్టిన్ బట్లర్.
గోల్డెన్ గ్లోబ్స్ 2023
ఉత్తమ పాటలో అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్
ఉత్తమ నటిగా టార్ సినిమాకు గాను కేట్ బ్లాంచెట్ అవార్డు గెలుచుకుంది. అలాగే ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమాకు గాను మిచెల్లి యో ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది.
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బాబీలోన్ సినిమాకు మ్యూజిక్ అందించిన జస్టిన్ హార్విట్జ్ అవార్డ్ గెలుచుకున్నాడు.
ఇక ఉత్తమ పాట విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అందుకున్నాడు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి.
బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలిమ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ నామినేట్ అయ్యింది. కానీ ఆర్ఆర్ఆర్ ను వెనక్కి నెట్టి అర్జెంటీనాకు చెందిన "అర్జెంటీనా 1985" అనే సినిమా అవార్డు దక్కించుకుంది.