కేజీఎఫ్ - వెంకటేష్ మహా కాంట్రవర్సీ: సారీ అంటూ వీడియో
ఒకానొక ఇంటర్వ్యూలో కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ, కేజీఎఫ్ సినిమా మీద చాలా కామెంట్లు చేసారు. ఆ సినిమాలోని రాఖీ భాయ్ పాత్ర మీదా, అమ్మ పాత్ర మీదా అనరాని మాటలు అన్నాడు. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. కేజీఎఫ్ అభిమానులు, కమర్షియల్ సినిమాలను అభిమానించే వారు వెంకటేష్ మహా మీద విరుచుకు పడ్డారు. కొందరైతే బూతులు తిట్టారు. ఇంకొందరు వెంకటేష్ మహాకు సపోర్ట్ గా నిలిచారు. కాకపోతే మెజారిటీ జనాలు మాత్రం, వెంకటేష్ మహా మీద సీరియస్ అయ్యారు. ఆ ట్రోలింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక కొత్త వీడియోను రిలీజ్ చేసాడు వెంకటేష్ మహా.
అభిప్రాయాన్ని అలాగే ఉంచుకుని వాడిన భాషకు సారీ అంటున్న వెంకటేష్ మహా
కేజీఎఫ్ మూవీ మీద మాట్లాడిన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవడం లేదని, ఆ అభిప్రాయాన్ని చెప్పడానికి వాడిన భాష కరెక్ట్ కాదని, అందుకు సారీ చెబుతున్నానని అన్నాడు. అంతే కాదు, అందులో తను మాట్లాడిన మాటలు తనొక్కడివే కాదనీ, చాలామందికి ఆ సినిమా మీద ఉన్న అభిప్రాయాన్ని, తన మాటల ద్వారా వెల్లడి చేసాననీ, అతను మాట్లాడిన మాటలు కేవలం ఒక సినిమాలోని కల్పిత పాత్ర మీదనే అనీ చెప్పుకొచ్చాడు. ఐతే వెంకటేష్ మహా సారీని జనాలు తీసుకోలేక పోతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికీ కూడా వెంకటేష్ మహా మీద ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. కేజీఎఫ్ విషయమై జరిగిన వివాదంలో నందినీ రెడ్డి, వివేక్ అత్రేయ.. జనాలకు సారీ తెలియజేసారు.