"ఇవాలే కలిశారు తొలిసారిగా…" అంటున్న "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి"
"ఇవాలే కలిశారు తొలిసారిగా…" అంటున్న "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి"
వ్రాసిన వారు
Nishkala Sathivada
March 06, 2023 | 08:29 pm
ఈ నెల 17 న రానున్న సినిమా "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి" టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు, ముద్దు ముచ్చట్లతో సాగే ఈ పాటను యూట్యూబ్ లో సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ పాటలో ఆయన నూతన మోహన్ తో కలిసి ఆలపించారు. భాస్కర భట్ల ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. నాగ శౌర్య, మాళవిక నాయర్ గతంలో "కళ్యాణ వైభోగమే" సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ఇద్దరికీ హిట్ చాలా అవసరం. విశ్వప్రసాద్ - దాసరి పద్మజ ఈ సినిమాను నిర్మిస్తుండగా, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.