నాగశౌర్య మూవీ ఫఫ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ పై అప్డేట్
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈరోజు సాయంత్రం 6గంటలకు టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుండి ఆల్రెడీ ఒక పాట రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండోపాటను రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, పద్మజా దాసరి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలు చేసాడు.
ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమకథగా వస్తున్న ఫఫ
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్ర టీజర్ ఇదివరకే రిలీజైంది. ఈ టీజర్ లో నాగశౌర్య పాత్ర, మాళవిక పాత్ర మంచి స్నేహితుల్లాగా కనిపించారు. మొదట స్నేహితులుగా కనిపించి ఆ తర్వాత ప్రేమలోకి దిగినట్లు చూపించారు. టీజర్ లో ఎక్కువ పాత్రలు కనబడలేదు కాబట్టి ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలే ఎక్కువగా ఉండనున్నాయని అర్థమవుతోంది. స్నేహం ప్రేమగా మారి అది బంధంగా మారినపుడు అక్కడ వచ్చే ఇబ్బందులనే సినిమాగా తీస్తున్నారేమోనని తెలుస్తోంది. ట్రైలర్ రిలీజైతే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని మార్చ్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా నాగశౌర్యకు హిట్ వస్తుందేమో చూడాలి.