Page Loader
రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ
రవితేజ నటించిన రావణాసుర టీజర్ విడుదల

రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 06, 2023
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ అంటే మాస్.. మాస్ సినిమాలకు రవితేజ పెట్టింది పేరు. అందుకే మాస్ మహారాజ అంటారు. అయితే రావణాసుర టీజర్ చూసిన తర్వాత రవితేజ లోని మరో కోణం బయటపడుతుంది. నిమిషం పాటున్న టీజర్ లో డైలాగులు రెండు మూడు కంటే ఎక్కువ లేవు. ఏదో క్రైమ్ చుట్టూ కథ నడుస్తున్నట్లు, దాని ఇన్వెస్టిగేషన్ కోసమే కథ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఆ క్రైమ్ ఏంటనేది మాత్రం టీజర్ లో వెల్లడి చేయలేదు. రవితేజ పాత్రలో మాత్రం చాలా షేడ్స్ కనిపించాయి. అవన్నీ సీరియస్ గా కనిపించడమే గమనించాల్సిన విషయం. సీతను ఎత్తుకెళ్ళాలంటే సముద్రం దాటితే పర్లేదు, ఈ రావణాసురుడిని కూడా దాటాలని రవితేజ చెప్పే డైలాగ్, రవితేజ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేసింది.

రావణాసుర

సుశాంత్ విలనా? క్యారెక్టర్ ఆర్టిస్టా?

రావణాసుర చిత్రంలో హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో వైవిధ్యంగా ఉన్నాడు. కాకపోతే అతను విలన్ గా చేస్తున్నాడా? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడా అనేది అర్థం కాకుండా ఉంటుంది. మొత్తానికి టీజర్ ఆసక్తిగా ఉంది, అదే టైమ్ లో అనేక అయోమయాలను ప్రేక్షకులకు వదిలేసింది. ఒక్కటి మాత్రం నిజం, ఈ సినిమాతో రవితేజ లోని కొత్త కోణం బయటపడుతుందని తెలుస్తోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్స్ బ్యానర్ లో సంయుక్తంగా రూపొందుతున్న ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన విడుదల అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రవితేజ నటించిన రావణాసుర టీజర్ విడుదల