LOADING...
JrNTR : తారక్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. 7 వారాల్లో 10 కిలోల తగ్గింపు
తారక్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. 7 వారాల్లో 10 కిలోల తగ్గింపు

JrNTR : తారక్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. 7 వారాల్లో 10 కిలోల తగ్గింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో పాటు పాత్ర కోసం పడే కష్టంతో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. గతంలో రాఖీ సినిమాలో బొద్దుగా కనిపించిన తారక్, తర్వాత యమదొంగ సమయంలో స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే అంకితభావంతో తన 31వ చిత్రం NTR-నీల్ కోసం మరోసారి స్టన్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో సిద్ధమవుతున్నారు.

Details

7 వారాల్లో 10 కిలోల తగ్గింపు

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం తారక్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కేవలం 7 వారాల్లోనే ఆయన సుమారు 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. దీనికోసం కఠినమైన క్రమశిక్షణను పాటిస్తూ ప్రతిరోజూ 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తున్నారు. అలాగే ఫిట్‌నెస్ ట్రైనర్ సూచనల మేరకు ఖచ్చితమైన డైట్‌ను కూడా అనుసరిస్తున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Details

భారీ కాస్టింగ్.. భారీ అంచనాలు

మైత్రీ మూవీ మేకర్స్, NTR ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ టొవినో థామస్, కన్నడ నటి రుక్మిణి వసంత్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్కు ఇంటెన్సిటీకి ఎన్టీఆర్ పవర్ జత కలిస్తే థియేటర్లలో సంచలనం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. షూటింగ్ శరవేగం.. గ్లింప్స్‌కు ప్లాన్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement