NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Samantha: అవాస్తవాల ప్రచారంతో బాధపడ్డాను.. అండగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు : సమంత
    తదుపరి వార్తా కథనం
    Samantha: అవాస్తవాల ప్రచారంతో బాధపడ్డాను.. అండగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు : సమంత
    అవాస్తవాల ప్రచారంతో బాధపడ్డాను.. అండగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు : సమంత

    Samantha: అవాస్తవాల ప్రచారంతో బాధపడ్డాను.. అండగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు : సమంత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 26, 2024
    10:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితులపై హీరోయిన్ సమంత మనసు విప్పి మాట్లాడింది.

    విడాకులు, ఆరోగ్య సమస్యలు, సామాజిక దృక్పథాలు వంటి విషయాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలను చేసింది.

    బంధం విచ్ఛిన్నం అయితే ఎక్కువగా అమ్మాయిలపైనే నిందలు వస్తాయని, సమాజం వాటిని మరింత తీవ్రంగా తీసుకుంటుందని ఆమె అన్నారు.

    డివోర్స్‌ తర్వాత అమ్మాయిలకు 'సెకండ్‌ హ్యాండ్‌, యూజ్డ్‌' వంటి పదాలను తగిలిస్తారని, వాటివల్ల అమ్మాయిల మనసు మరింత గాయపడుతుందని తన బాధను వ్యక్తపరిచింది.

    ఇటువంటి సమయంలో తనకు మద్దతుగా ఉన్న స్నేహితులు, కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన పెళ్లి గౌనును రీ మోడల్‌ చేయించిన విషయంపై సమంత స్పందించారు.

    Details

    ప్రతి ముగింపు కొత్త ఆరంభానికి సంకేతం

    ఆ నిర్ణయం చాలా కఠినమైందని, అది ప్రతీకారానికి సంబంధించినది కాదని, తన జీవితంలో జరిగిన సంఘటనల్ని దాచిపెట్టాలనుకోలేదన్నారు.

    ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి సంకేతం మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది.

    సమంత తన అనారోగ్యం కారణంగా 'సిటడెల్‌: హనీ బన్నీ' చిత్రంలో మొదట యాక్షన్ సన్నివేశాలకు సిద్ధం కాలేకపోయిన విషయాన్ని వెల్లడించారు.

    ఈ చిత్రీకరణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు తనకు కొత్త శక్తిని ఇచ్చాయని చెప్పారు. వ్యక్తిగత సమస్యలు ఎదురైనా, ఎదిగే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సమంత
    టాలీవుడ్

    తాజా

    HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా? హరిహర వీరమల్లు
    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు

    సమంత

    సమంత ఒడిలో కూర్చుని సెల్ఫీ తీసుకున్న కోతి: వైరల్ అవుతున్న ఫోటోలు  సినిమా
    Samantha: ప్రేమపై సమంత పాజిటివ్ పోస్ట్, మళ్లీ లవ్‌లో పడిందా? సినిమా
    మట్టితో బొమ్మలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్న సమంత: ఫోటోలు వైరల్  తెలుగు సినిమా
    సింగర్ చిన్మయి పిల్లలతో నాటు నాటు పాటకు డాన్స్ చేయించిన సమంత  సినిమా

    టాలీవుడ్

    Tollywood: తెలుగు నిర్మాతలతో చేతులు కలుపుతున్న బాలీవుడ్ నిర్మాతలు బాలీవుడ్
    Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల'.. ఆది సాయి కుమార్ మరో క్రేజీ మూవీ..  సినిమా
    Citadel: హిందీ మాట్లాడాలంటే భయంగా ఉంటుంది : సమంత సమంత
    Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది! ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025