NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బిగ్ బాస్ తెలుగు: విజయ్ తప్పుకుంటున్నాడు, బాలకృష్ణను పట్టుకోవాల్సిందేనా
    తదుపరి వార్తా కథనం
    బిగ్ బాస్ తెలుగు: విజయ్ తప్పుకుంటున్నాడు, బాలకృష్ణను పట్టుకోవాల్సిందేనా
    హోస్ట్ గా బాలయ్యను ఒప్పించే పనిలో బిగ్ బాస్ టీమ్

    బిగ్ బాస్ తెలుగు: విజయ్ తప్పుకుంటున్నాడు, బాలకృష్ణను పట్టుకోవాల్సిందేనా

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 20, 2023
    10:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు పెద్ద కష్టమే వచ్చి పడింది. వరుసగా 4సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, వచ్చే సీజన్ నుండి తప్పుకుంటుండంతో హోస్ట్ గా ఎవరిని తీసుకురావాలో అర్థం కావట్లేదు.

    ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకుల దగ్గర బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

    యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తే యువతను ఆకర్షించవచ్చని ప్లాన్ చేస్తున్నారు. ఐతే విజయ్ దేవరకొండ వద్దకు ప్రపోజల్ వెళ్ళిందనీ, కానీ విజయ్ నుండి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలుస్తోంది.

    నెంబర్ వన్ యారి షోని చక్కగా డీల్ చేసిన రానా దగ్గుబాటిని కూడా అడిగారట, ఆయన పాజిటివ్ గా స్పందించలేదని అంటున్నారు.

    బాలకృష్ణ

    అన్ స్టాపబుల్ తో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో బిగ్ బాస్

    ప్రస్తుతం బిగ్ బాస్ బృందం బాలయ్య కోసం చూస్తోంది. అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా బాలకృష్ణ క్రేజ్ పెరిగిపోయింది.

    అందువల్ల బాలకృష్ణ ను హోస్ట్ గా పట్టుకొస్తే బాగుంటుందని బిగ్ బాస్ బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హోస్ట్ గా చేయడానికి బాలయ్య ఒప్పుకుంటే బిగ్ బాస్ కి మంచి క్రేజ్ వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు.

    మరి బాలయ్య ఒప్పుకుంటాడో లేదో తెలియదు. ఇదిలా ఉంటే బాలయ్య వేరే షో చేస్తే, అన్ స్టాపబుల్ క్రేజ్, తగ్గిపోతుందేమోనని ఆహా ఆందోళన పడుతోంది.

    మరి బాలయ్య ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. బాలయ్య హోస్ట్ గా రావాలనీ, ఆయన బాగ డీల్ చేయగలరనీ అభిమానులతో పాటు చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    ఓటిటి

    ప్రెగ్నెన్సీ వార్త తర్వాత మొదటి సారి కెమెరా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన సినిమా
    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో! ప్రైమ్
    గుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ టెక్నాలజీ
    2008 తర్వాత పుట్టిన వారు సిగరెట్ కొంటే నేరమట.. ఎక్కడో తెలుసా? అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025