Loading...
Chiranjeevi: ఇంట్లోనే నిమజ్జనం.. సీడ్ గణేశుడిపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు!
ఇంట్లోనే నిమజ్జనం.. సీడ్ గణేశుడిపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు!

Chiranjeevi: ఇంట్లోనే నిమజ్జనం.. సీడ్ గణేశుడిపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రకృతి సంరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈసారి అందరూ సీడ్ గణేశుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సీడ్ గణేశుడిని పూజించిన అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేయడం వల్ల.. ఆ వినాయకుడు మొక్కగా ఎదిగి మనల్ని ఆశీర్వదిస్తాడని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా 'గ్రీన్ ఇండియా చాలెంజ్' రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించారు.

వివరాలు

ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయం

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఓ యజ్ఞంలా భావించి ఇప్పటికే 20 కోట్ల మొక్కలు నాటేలా లక్షల మందిని ప్రోత్సహించిన సంతోష్ కుమార్ అభినందనీయుడని అన్నారు.

పచ్చదనం పెంపు కోసం ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడిన చిరంజీవి.. సంతోష్ కుమార్ దీక్షకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

ADVERTISEMENT