Loading...
Ravi Teja: 'ఇరుముడి' నన్ను కదిలించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా: రవితేజ
'ఇరుముడి' నన్ను కదిలించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా: రవితేజ

Ravi Teja: 'ఇరుముడి' నన్ను కదిలించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా: రవితేజ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

'హిందీ'లో రాజ్‌కుమార్‌ హిరాణీ సినిమాలు చూస్తే భావోద్వేగానికి గురై కన్నీళ్లు వస్తాయని.. తెలుగులో తనను అంతగా కదిలించిన సినిమా 'ఇరుముడి' అని కథానాయకుడు రవితేజ అన్నారు. రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది. బేబీ నక్షత్ర, సాయికుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఓటీటీల్లో తమిళ, మలయాళ సినిమాలు చూస్తూ.. ''ఇలాంటి కథలు మన దగ్గర ఎందుకు రావు?'' అని అనుకునేవాళ్లమని గుర్తుచేశారు.

వివరాలు

జీవీ ప్రకాశ్‌ సంగీతం అద్భుతం

ఇప్పుడు అలాంటి మూలాలున్న కథతోనే 'ఇరుముడి' ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. 'నాది రాతి గుండె. సాధారణంగా నాకు ఏడుపు రాదు. అలాంటిది 'ఇరుముడి' సినిమా చూసి నేను ఏడ్చేశాను.

శివ నాకు కథ చెప్పడంతో పాటు త్రినాథ్‌ పాత్ర గురించి వివరించాడు. టైటిల్‌ చెప్పగానే 'సూపర్‌' అన్నాను.

ఇలాంటి మంచి ఫీల్‌ ఉన్న సినిమాను ప్రేక్షకులకు అందించినందుకు శివను అభినందిస్తున్నానని రవితేజ తెలిపారు.

ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ అందించిన సంగీతం ఆత్మగా నిలిచిందని రవితేజ అన్నారు.

వివరాలు

మా అమ్మాయి కూడా కన్నీళ్లు పెట్టుకుంది

''సినిమా చూస్తున్న సమయంలో ఆ సంగీతం కారణంగా ప్రేక్షకులకు అప్రయత్నంగానే కళ్లలో నీళ్లు వస్తున్నాయి.

వాళ్ల స్పందన చూస్తుంటే నా కళ్లు కూడా చెమర్చాయి. మా అమ్మాయి మోక్ష సైతం ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.

సుమారు 20 ఏళ్ల క్రితం థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు రావడం కూడా నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేసింది.

నిజంగా ఈ ఆనందం మామూలుది కాదు'' అని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు

ఇళ్లలోకి తీసుకెళ్లిన సినిమాలు.. హృదయాల్లోకి 'ఇరుముడి'

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. 'నిన్ను కోరి', 'మజిలి' సినిమాలు తనను తెలుగు ప్రేక్షకుల ఇళ్లలోకి తీసుకెళ్లాయని.. 'ఇరుముడి' మాత్రం వారి హృదయాల్లోకి తీసుకెళ్లిందని అన్నారు.

'ఈ సినిమా కోసం మేమంతా ఒక యుద్ధంలా పనిచేశాం. అందరి సమష్టి కృషి వల్లే ఇంతటి విజయం సాధ్యమైంది. దర్శకుడికి హీరో స్వేచ్ఛ ఇస్తే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి.

ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు రవితేజను కొడతారు. 'నన్ను కొడితే అభిమానులు ఒప్పుకుంటారా?' అని రవితేజ ఆలోచించి ఉంటే ఇలాంటి సినిమా వచ్చేది కాదు.

కథ చెప్పే సమయంలో మేము ఎలాంటి లెక్కలూ వేసుకోలేదు. ప్రేక్షకుడికి కథను కనెక్ట్‌ చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేశామని శివ నిర్వాణ వివరించారు.

ADVERTISEMENT

వివరాలు

రోజున్నరకే లాభాల్లోకి.. నిర్మాతల ఆనందం

ఇక సినిమాలో మణెమ్మ పాత్రలో బేబీ నక్షత్ర అద్భుతంగా నటించిందని.. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనే అందుకు నిదర్శనమని దర్శకుడు చెప్పారు.

అలాగే కావేరి పాత్రను ప్రియా భవానీ శంకర్‌ ఎంతో సహజంగా పోషించారని ప్రశంసించారు. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ మాట్లాడుతూ.. 'ఇరుముడి' విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.

''ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం గత 50 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది.

ఇలాంటి సినిమాను నిర్మించే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ చిత్రానికి ఎదురులేదు. మరో నాలుగు వారాల పాటు సినిమా ఇదే జోరుతో కొనసాగుతూనే ఉంటుంది'' అని తెలిపారు.

ADVERTISEMENT