
Nani: మంచి సినిమాలను సపోర్ట్ చేయడం నా బాధ్యత : హీరో నాని
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు.
తాజాగా నాని నటించిన 'హిట్ 3' చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
అదే విధంగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రం గ్లింప్స్‌తోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కొన్ని కథలు ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతాయని నమ్మినా, వాటికి మరింత బాగా సూటయ్యే నటులను దర్శకులు, నిర్మాతలకు తాను సూచించానని నాని చెప్పారు.
Details
చాలా కథలు విన్నా
ఐదారేళ్లుగా తాను చాలా కథలు విన్నా. కొన్ని బ్లాక్‌బస్టర్ అవుతాయని నమ్మాను. అయితే వాటికి మరింత బాగా సూటయ్యే నటుల దగ్గరికి వెళ్లేలా చేశానని తెలిపారు.
మంచి సినిమాలను సపోర్ట్ చేయడం తన బాధ్యత అని నాని చెప్పారు.
ఈ క్రమంలో బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండితో 'ఎల్లమ్మ' అనే సినిమాకు తొలుత నాని ఓకే చెప్పాడని వార్తలొచ్చాయి.
కానీ ఆ కథకు నితిన్ మరింత సూటవుతాడని భావించి, అదే విషయాన్ని దర్శకుడికి సూచించాడని వార్తలు వచ్చాయి.
Details
మెగాస్టార్ చిరంజీవి అంటే అంతకుమించి!
నాని తన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి అంటే డ్యాన్స్, యాక్షన్ మాత్రమే కాదు, అంతకుమించి చాలా ఉంది.
కానీ కొన్నాళ్లుగా ఆ అంశాలు మిస్ అవుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తే, చిరు నుంచి మిస్సవుతున్న ఆ ప్రత్యేకతను ఆయన తెరపై తీసుకురాగలరని నాని చెప్పారు.
ఇక హిట్ 3 చిత్రంలో ఎక్కువగా వైలెన్స్ ఉంటుందని నాని వెల్లడించారు. కథ ఇంటెన్సిటికి తగిన విధంగా హింస ఉంటుంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ మరింత మాస్‌గా ఉంటుందని అన్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది.