LOADING...
Megastar Chiranjeevi : ఎన్టీఆర్ పేరుతో అవార్డు అందుకోవడం గర్వకారణం.. చిరంజీవి ఎమోషనల్ పోస్టు!
ఎన్టీఆర్ పేరుతో అవార్డు అందుకోవడం గర్వకారణం.. చిరంజీవి ఎమోషనల్ పోస్టు!

Megastar Chiranjeevi : ఎన్టీఆర్ పేరుతో అవార్డు అందుకోవడం గర్వకారణం.. చిరంజీవి ఎమోషనల్ పోస్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్' వేడుక గురువారం హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ రంగంలోని వివిధ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, గేయ రచయితలు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందించారు.

Details

నా జీవితంలో గొప్ప గౌరవం

చరిత్ర సృష్టించిన మహానటుడు నందమూరి తారక రామారావు గారు తన పేరుతో లలిత కళలకు కొత్త దిశనిచ్చిన మహాకళాకారుడు. ఎన్టీఆర్ అంటే N - నాట్యం, T - తాళం, R - రాగం... ఇలా కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన గొప్ప వ్యక్తి. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా, ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ నటుడు. రామారావు గారు సినిమాల కోసం పుట్టినట్టే అనిపిస్తుంది. ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేం. అలాంటి మహానుభావుడి పేరుతో ఉన్న 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డు' నాకు లభించడం నా జీవితంలో గొప్ప గౌరవమని చిరంజీవి పేర్కొన్నారు.

Advertisement