Loading...
Irumudi: శబరిమల బ్యాక్‌డ్రాప్‌ కాదట.. 'ఇరుముడి' కథపై శివ నిర్వాణ సంచలన క్లారిటీ
శబరిమల బ్యాక్‌డ్రాప్‌ కాదట.. 'ఇరుముడి' కథపై శివ నిర్వాణ సంచలన క్లారిటీ

Irumudi: శబరిమల బ్యాక్‌డ్రాప్‌ కాదట.. 'ఇరుముడి' కథపై శివ నిర్వాణ సంచలన క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి'. ఫ్యామిలీ, డివోషనల్‌ అంశాలను కలగలిపి తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌లో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దీంతో 'ఇరుముడి' కథ శబరిమల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ.. సినిమాకు, శబరిమల దేవాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

వివరాలు

శబరిమలతో సంబంధం లేదు

'ఈ కథకు శబరిమలతో ఎలాంటి సంబంధం లేదు. సినిమాలో కథానాయకుడి జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఒక భాగం మాత్రమే. అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు ఆ సమయంలో తమ నియమాలు, అలవాట్ల విషయంలో ఎంతో నిష్టగా ఉంటారు.

వ్యసనాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి అయ్యప్ప దీక్ష తీసుకోవాల్సి వస్తే.. ఆ 41 రోజులు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది.

అక్కడి నుంచే కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది.

కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది కాబట్టే కథకు అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని ఎంచుకున్నాను. అంతేతప్ప ఇది శబరిమలకు సంబంధించిన కథ కాదని శివ నిర్వాణ వివరించారు.

వివరాలు

41 రోజులే కథకు కీలకం

సినిమాలోని 41 రోజుల కథే స్క్రీన్‌ప్లేకు ప్రధాన బలంగా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ అంశం సినిమా కథనాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుందని చెప్పారు.

అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి ముందు కథానాయకుడి జీవితంలో ఏం జరిగింది? దీక్ష తీసుకున్న తర్వాత ఆ 41 రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే అంశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగించేలా ఉంటాయని శివ నిర్వాణ పేర్కొన్నారు.

దీంతో ఇప్పటివరకు 'ఇరుముడి'పై ఉన్న శబరిమల బ్యాక్‌డ్రాప్‌ ప్రచారానికి దర్శకుడి వివరణతో తెరపడినట్లయింది.

అయ్యప్ప దీక్షను కథలోని కీలక సంఘర్షణకు నేపథ్యంగా మాత్రమే ఉపయోగించినట్లు స్పష్టమైంది.

ADVERTISEMENT

వివరాలు

ఆగస్టు 21న విడుదల

రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీ, డివోషనల్‌ అంశాలతో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తోంది. శివ నిర్వాణ-రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ఎలాంటి కథతో అలరిస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT