ఓటీటీ రిలీజ్: అంజలి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఝాన్సీ సీజన్ 2 వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
హీరోయిన్ అంజలి, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలుగా నటించిన సిరీస్, "ఝాన్సీ" సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ లో ఉంది.
2022 అక్టోబర్ లో వచ్చిన ఝాన్సీ సీజన్ 1 కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం, ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
మతిమరుపుతో బాధపడే మధ్యవయసు మహిళకు గతంలో జరిగిన సంఘటనల వల్ల ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయనేదే కథ.
జీవితంలో ఎదగాలనుకునే ఒక అమ్మాయి, సడెన్ గా అనుకోని గందరగోళంలో పడిపోతుంది. అక్కడి నుండి బయటకు రావడానికి తాను చేసిన ప్రయత్నాన్ని ఝాన్సీ సీజన్ 1లో చూపించారు.
ఓటీటీ రిలీజ్
థ్రిల్లింగ్ అంశాలతో నిండిపోయిన ఝాన్సీ సీజన్ 2
సీజన్ 1 లాగే సీజన్ 2లో కూడా థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అయ్యింది. సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదురించి, తనకు అడ్డొచ్చే అడ్డంకుల్ని ఎలా దాటిందో సీజన్ 2 లో చూపిస్తున్నారు.
ప్రధాన పాత్రలో అంజలి కనిపించింది. మిగతా పాత్రల్లో చాందినీ చౌదరి, ముమైత్ ఖాన్, ఆదర్శ్ బాలకృష్ణ, చైతన్య సాగిరాజు, రాజ్ అర్జున్ నటించారు. ఈరోజు నుండి హాట్ స్టార్ లో ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ అవనుంది.
తెలుగులో రూపొందిన ఈ సిరీస్, హిందీ, తమిళం సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. హాట్ స్టార్ ఒరిజినల్ గా రూపొందిన ఈ సిరీస్ కి తిరు క్రిష్ణమూర్తి దర్శకత్వం వహించారు.