Devara : ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ వచ్చేసింది.. థ్రిల్ అవుతున్న అభిమానులు
టాలీవుడ్ స్టార్ పెర్ఫార్మర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా దేవర.ఈచిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది.సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు మూవీ గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం. 1-నిమిషం 20-సెకన్ల ఈ క్లిప్‌లో "ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని,నెత్తురునే ఎక్కువ చుసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు".అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్,ఆకర్షణీయమైన విజువల్స్ తో కూడిన ఈ గ్లింప్స్ లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర చాలా వైల్డ్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఈ పాత్రని చూసిన అభిమానులు థ్రిల్ అవుతున్నారు.