Dragon Movie: వీడిన ఉత్కంఠ...డ్రాగన్ మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'డ్రాగన్'కు సంబంధించి అభిమానులు ఎదురుచూస్తున్న కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంగీతం అందించేది ఎవరో ప్రశాంత్ నీల్ స్వయంగా వెల్లడించాడు. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రవి బస్రూర్.. 'డ్రాగన్'కు కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన సందేహానికి సమాధానం దొరికినట్లయింది.
Details
ప్రశాంత్ నీల్ మాటతో క్లారిటీ
మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ప్రశాంత్ నీల్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ 'డ్రాగన్' చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరని ప్రశ్నించాడు.
దీనికి ఆయన "ది వన్ అండ్ ఓన్లీ రవి బస్రూర్ సర్" అంటూ సమాధానమిచ్చాడు. దీంతో ఇప్పటివరకు వినిపించిన ఊహాగానాలకు తెరపడింది. రవి బస్రూర్ గతంలో ప్రశాంత్ నీల్ సినిమాలకు అందించిన నేపథ్య సంగీతం ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే.
ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చే మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన ఎలాంటి బాణీలు సిద్ధం చేస్తారోననే ఆసక్తి మొదలైంది.
Details
అంతర్జాతీయ డ్రగ్స్ యుద్ధం నేపథ్యంలో కథ
ఇప్పటికే విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచింది. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య జరిగే అంతర్జాతీయ ఓపియం యుద్ధం చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఎన్టీఆర్ 'లూగర్/డ్రాగన్'గా పిలిచే శక్తిమంతమైన కిల్లర్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్‌గా, మలయాళ నటుడు బిజూ మీనన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలు కథలో ఎలాంటి మలుపులు తీసుకొస్తాయో చూడాలి.
Details
2027 జూన్ 11న విడుదల?
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తొలుత 2026 జూన్ 25న విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విడుదల తేదీని 2027 జూన్ 11కి మార్చినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ గత ఏడాది ఏప్రిల్ నుంచే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. భారీ యాక్షన్, అంతర్జాతీయ నేపథ్యం, ప్రశాంత్ నీల్ దర్శకత్వం, రవి బస్రూర్ సంగీతం.. ఇలా ప్రతి అంశం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఇప్పుడు అభిమానుల ఎదురుచూపు తెరపై ఎన్టీఆర్-నీల్-రవి బస్రూర్ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందన్నదే!