Page Loader
NTR: హృతిక్‌ రోషన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌'పై స్పందించిన ఎన్టీఆర్‌ 
హృతిక్‌ రోషన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌'పై స్పందించిన ఎన్టీఆర్‌

NTR: హృతిక్‌ రోషన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌'పై స్పందించిన ఎన్టీఆర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2'కు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది అయాన్ ముఖర్జీ కాగా, నిర్మాణ బాధ్యతలు ప్రముఖ బ్యానర్ యశ్ రాజ్ ఫిల్మ్స్‌ తీసుకుంది. కథానాయికగా కియారా అద్వానీ నటిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఓ ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ఉండబోతోందని హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇందుకు తాజాగా ఎన్టీఆర్ స్పందిస్తూ..''సర్‌ప్రైజ్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను.కబీర్... నిన్ను వేటాడి,నీకో ప్రత్యేక బహుమతిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాను''అంటూ సరదాగా కామెంట్ చేశారు.

వివరాలు 

'రా' ఏజెంట్‌ పాత్రలో ఎన్టీఆర్‌

ప్రస్తుతం 'వార్ 2' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్‌ను విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అభిమానులు ఈ టీజర్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందే చిత్ర బృందం 'వార్ 2'ను ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన 'వార్' సినిమా ఘనవిజయం సాధించి, బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆ చిత్రం సీక్వెల్‌గానే ఇప్పుడు 'వార్ 2' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రా ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్టీఆర్‌ చేసిన ట్వీట్