Page Loader
NTR: హిందీలో జూనియర్ ఎన్టీఆర్ రెండో సినిమా.. ఆ బిగ్ ప్రాజెక్ట్‌‌పై సైన్ చేశాడా?
హిందీలో జూనియర్ ఎన్టీఆర్ రెండో సినిమా.. ఆ బిగ్ ప్రాజెక్ట్‌‌పై సైన్ చేశాడా?

NTR: హిందీలో జూనియర్ ఎన్టీఆర్ రెండో సినిమా.. ఆ బిగ్ ప్రాజెక్ట్‌‌పై సైన్ చేశాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 25, 2024
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం 'వార్ 2'లో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్నాడు, ఈ మూవీకి ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా, ఎన్టీఆర్ మరో హిందీ ప్రాజెక్ట్‌లో నటించడానికి సంతకం చేసినట్లు వార్తలు విన్పిపిస్తున్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు చేసిన కథ తారక్‌కు నచ్చినట్లు సమాచారం. అన్ని విషయాలు అనుకున్నట్లుగా జరిగితే, 2025 చివరలో ఈ సినిమా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

Details

యశ్ రాజ్‌తో అగ్రిమెంట్‌!

ఈ ప్రాజెక్ట్‌ను దర్శకత్వం వహించే దర్శకుడి పేరును మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్ స్టార్ యాక్టర్లతో మూడు సినిమా ఒప్పందాలు చేసుకుంది. దీంతో ఎన్టీఆర్‌ కూడా అలాంటి ఒప్పందానికి సంతకం చేశాడా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తన ప్రభావాన్ని చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.