NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కళ్యాణం కమనీయం: పెద్ద సినిమాల నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంతోష్ శోభన్
    తదుపరి వార్తా కథనం
    కళ్యాణం కమనీయం: పెద్ద సినిమాల నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంతోష్ శోభన్
    జనవరి 14వ తేదీన విడుదల అవుతున్న కళ్యాణం కమనీయం

    కళ్యాణం కమనీయం: పెద్ద సినిమాల నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంతోష్ శోభన్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 10, 2023
    05:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో చిన్న సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడటం సహజం. ఈ సంక్రాంతికి అటు వీరసింహారెడ్డి, ఇటు వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

    ఇవేకాక తమిళ నటుడు విజయ్ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు చిత్రాలు కూడా సంక్రాంతి పండక్కి ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.

    ఇన్ని పెద్ద సినిమాల నడుమ కళ్యాణం కమనీయం అనే సినిమాను తీసుకొస్తున్నాడు హీరో సంతోష్ శోభన్. పేపర్ బాయ్ సినిమాతో తనకంటూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

    ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన ఏక్ మినీ కథ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

    ఆ తర్వాత వచ్చిన మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

    తెలుగు సినిమా

    యూత్ ఫుల్ రొమాన్స్ తో వస్తున్న సినిమా

    ప్రస్తుతం కళ్యాణం కమనీయం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సంతోష్. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ విడుదల అవుతుంది.

    ఇన్ని పెద్ద సినిమాల మధ్య వస్తున్న ఈ సినిమా, ఎలా నిలబడుతుందనే దానిపై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. ఐతే సంతోష్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడట.

    ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య బంధాన్ని చాలా బాగా చూపించామని, యూత్ పుల్ రొమాన్స్ ఉంటుందని, కుటుంబం మొత్తం చూసే విధంగా వినోదాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు.

    నిర్మాత యూవీ కాన్సెప్ట్ కూడా ఈ విషయంలో నమ్మకంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి సంతోషం నమ్మకం నిలబడి, ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్సాఫీసు దగ్గర మెరిసిన కుర్ర హీరోలు టాలీవుడ్
    సోషల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్పిన ఉపాసన టాలీవుడ్
    2022లో తెలుగు తెరకు పరిచయమైన హీరోలు, హీరోయిన్లు టాలీవుడ్
    ఇడియట్ 2 సీక్వెల్ పై ఆన్సర్ చేసిన మాస్ మహారాజా రవితేజ టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025