Page Loader
SIIMA AWARDS: ఉత్తమ నటుడిగా కమల్ హాసన్
ఉత్తమ నటుడిగా కమల్ హాసన్

SIIMA AWARDS: ఉత్తమ నటుడిగా కమల్ హాసన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2023
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా అవార్డ్స్ 2023 ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. నిన్న రాత్రి కోలివుడ్ అవార్డులను అందజేశారు. తమిళ బెస్ట్ హీరో అవార్డును విశ్వనటుడు కమల్ హాసన్ దక్కించుకున్నాడు. విక్రమ్ సినిమా గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇక ఉత్తమ నటి అవార్డును త్రిష అందుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి ఆమెకు ఈ అవార్డు లభించింది. తమిళంలో 'విక్రమ్', పొన్నియిన్ సెల్వన్ చిత్రాలకు పోటా పోటీగా అవార్డులు లభించాయి.

Details

కోలీవుడ్ లో అవార్డులు గెలుచుకున్న నటీనటులు

'సైమా' 2023 అవార్డులు - కోలీవుడ్‌ విజేతలు వీళ్లే! ఉత్తమ నటుడు: కమల్‌హాసన్‌ (విక్రమ్‌) ఉత్తమ నటి: త్రిష (పొన్నియిన్‌ సెల్వన్‌ 1) ఉత్తమ దర్శకుడు: లోకేశ్‌ కనగరాజ్‌ (విక్రమ్‌) ఉత్తమ చిత్రం: పొన్నియిన్‌ సెల్వన్‌ 1 ఉత్తమ సహాయ నటుడు: కాళీ వెంకట్‌ (గార్గి) ఉత్తమ సహాయ నటి: వసంతి (విక్రమ్‌) ఉత్తమ విలన్‌: ఎస్‌.జె.సూర్య (డాన్‌) ఉత్తమ హాస్య నటుడు: యోగిబాబు (లవ్‌టుడే) ఉత్తమ పరిచయ నటుడు: ప్రదీప్‌ రంగనాథన్‌ (లవ్‌ టుడే) ఉత్తమ పరిచయ నటి: ఆదితి శంకర్‌ (విరుమన్‌) ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్‌ (విక్రమ్‌) ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ ఉత్తమ గీత రచయిత: ఇళంగో కృష్ణన్ ఉత్తమ నేపథ్య గాయకుడు: కమల్‌హాసన్‌ (విక్రమ్‌)