
Hit3 Leaks: 'హిట్ 3'లో కార్తీ గెస్ట్ రోల్? లీక్‌పై ఫైర్ అయిన డైరెక్టర్ శైలేష్!
ఈ వార్తాకథనం ఏంటి
నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' మే 1న విడుదల కానుంది.
చిత్రబృందం ప్రొమోషన్ పనుల్లో బిజీగా ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక సమాచారం లీక్ కావడం దర్శకుడు శైలేష్ కొలనాను తీవ్ర అసహనానికి గురిచేసింది.
మీడియా వ్యవహార శైలిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఓ పోస్ట్ చేశారు.
Details
లీక్‌లపై శైలేష్ కొలను స్పందన
తాజాగా శైలేష్ కొలను తన సినిమా లీక్స్‌పై సోషల్ మీడియాలో స్పందిస్తూ, మన సినిమా అనుభవాన్ని ప్రేక్షకుల కోసం ఆసక్తికరంగా రూపొందించేందుకు చిత్ర బృందం ఎన్నో రోజులపాటు కష్టపడుతోంది.
కానీ మీడియా కొన్ని కీలకమైన అంశాలను లీక్ చేసి ఆ అనుభూతిని నాశనం చేస్తోంది. ఇవన్నీ అతి త్వరగా రిపోర్ట్ చేయాలనే కర్తవ్యాన్ని మించినవి.
ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి లేకుండా సినిమాకు సంబంధించిన కీలక సమాచారం బయటపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇలా లీక్ చేయడం చిత్రబృందం శ్రమను దోచుకోవడమే కాదని ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్‌ను దొంగిలించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Details
ఏం లీక్ అయ్యింది?
నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హిట్ 3' చిత్రానికి శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టాయి.
అయితే ఈ సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తున్నారనే వార్త లీక్ కావడం దర్శకుడిని నిరాశకు గురిచేసింది.
ఈ లీక్ విషయం తెలుసుకున్న శైలేష్ కొలను, జర్నలిజం విలువల గురించి ప్రస్తావిస్తూ, గతంలో సినిమా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పటికీ మీడియా వాటిని బయటపెట్టకుండా గౌరవంగా వ్యవహరించేదని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు జర్నలిజం మారిపోయిందని, కాస్త బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.