LOADING...
KCR MOVIE: ఓటీటీలోకి కేసీఆర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
ఓటీటీలోకి కేసీఆర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

KCR MOVIE: ఓటీటీలోకి కేసీఆర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2024
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh),డైరెక్టర్ అంజి (Anji) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'కేసీఆర్' (కేశవ చంద్ర రమావత్). ఈ చిత్ర కథ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఆధారంగా రూపుదిద్దుకుంది. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికవడంలో చోటుచేసుకున్న పరిణామాలను బంజారా యువకుడి ప్రయాణానికి అనుసంధానించి ఈ కథను అల్లారు. ఈ సినిమాలో రాకింగ్ రాకేష్‌కు జోడీగా అనన్య కృష్ణన్ (Ananya Krishnan) హీరోయిన్‌గా నటించగా, ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్‌లో తన అరంగేట్రం చేసింది.

వివరాలు 

 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ 

రాకింగ్ రాకేష్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లేను కూడా స్వయంగా అందించాడు. భారీ అంచనాల మధ్య నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ సంపాదించుకుంది. తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ, "కేసీఆర్ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha)లో స్ట్రీమింగ్ కానుంది" అని అధికారికంగా ప్రకటించారు. అయితే, విడుదల తేదీని ఇంకా స్పష్టత ఇవ్వలేదు. డిసెంబర్ చివరి లేదా జనవరి మొదటి వారంలో సినిమా ఓటీటీలో విడుదల కావచ్చని సమాచారం.