Page Loader
కీర్తి సురేష్ జీవితంలో మిస్టరీ మ్యాన్: త్వరలో చెబుతానంటూ పోస్ట్ 
మిస్టరీ మ్యాన్ గురించి స్పందించిన కీర్తి సురేష్

కీర్తి సురేష్ జీవితంలో మిస్టరీ మ్యాన్: త్వరలో చెబుతానంటూ పోస్ట్ 

వ్రాసిన వారు Sriram Pranateja
May 23, 2023
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది కీర్తి సురేష్. అయితే మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా విజయాలు అందుకోలేవు. ఇటీవల వచ్చిన దసరా సినిమా, తెలుగులో ఆమెకు మంచి విజయాన్ని అందించింది. దసరా సినిమాలోని వెన్నెల పాత్ర, ప్రేక్షకులందరికీ ఎంతగానో నచ్చింది. అదలా ఉంచితే, గతకొన్ని రోజులుగా కీర్తి సురేష్ పెళ్ళిపై అనేక వార్తలు వస్తున్నాయి. తన జీవితంలో మిస్టరీ మ్యాన్ ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి. దుబాయ్ లో ఉండే తన ఫ్రెండ్ ఫర్హాద్ బిన్ లిఖాయ్ త్ తో కీర్తి సురేష్ పెళ్ళి ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ విషయమై కీర్తి సురేష్ స్పందించింది.

Details

మిస్టరీ మ్యాన్ గురించి తెలియజేసే వరకు ప్రశాంతంగా ఉండమని కోరిన కీర్తి 

సోషల్ మీడియా వేదికగా స్పందించిన కీర్తి సురేష్, ఈసారి పెళ్ళి అంటూ నా ఫ్రెండ్ ని మధ్యలోకి లాగుతున్నారా? నిజమైన మిస్టరీ మ్యాన్ ఎవరో నేనే మీకు చెబుతాను. అప్పటి వరకూ హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, కీర్తి సురేష్ ప్రస్తుతం చిరంజీవి తో కలిసి భోళాశంకర్ సినిమాలో నటిస్తోంది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతుంది. తమిళంలో రఘుథాత, మామన్నన్, సిరెన్ చిత్రాలు సెట్స్ మీదున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మిస్టరీ మ్యాన్ గురించి కీర్తి ట్వీట్