NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రోజులు పెరుగుతున్న దసరాకు తగ్గని ఆదరణ, అల్లు అర్జున్ ట్వీట్ తో చర్చల్లోకి దసరా 
    తదుపరి వార్తా కథనం
    రోజులు పెరుగుతున్న దసరాకు తగ్గని ఆదరణ, అల్లు అర్జున్ ట్వీట్ తో చర్చల్లోకి దసరా 
    దసరాపై అల్లు అర్జున్ పొగడ్తలు

    రోజులు పెరుగుతున్న దసరాకు తగ్గని ఆదరణ, అల్లు అర్జున్ ట్వీట్ తో చర్చల్లోకి దసరా 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 17, 2023
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం, బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల దగ్గర తన సత్తా చాటుతోంది.

    ఈసారి వేసవిలో వచ్చిన మొదటి పెద్ద హిట్ గా దసరాను చెప్పుకోవచ్చు. అయితే దసరా సినిమాపై తెలుగు సినిమా సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. ఆ జాబితాలోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయారు.

    దసరా సినిమాపై తనదైన స్పందన తెలియజేసిన అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని నటన బాగుందనీ, కీర్తి సురేష్ హైలైట్ అయ్యిందనీ అన్నాడు.

    నేపథ్య సంగీతం అందించిన సంతోష నారయణన్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేసాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ను మెచ్చుకున్నాడు.

    Details

    వైరల్ గా మారిన అల్లు అర్జున్ ట్వీట్ 

    ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ వైరల్ గా మారుతోంది. దాదాపు తెలుగు సినిమా సెలెబ్రిటీలు అందరూ దసరా సినిమా గురించి మాట్లాడారు. రాజమౌళి, సుకుమార్ ఇలా లిస్టులో చాలామంది ఉన్నారు.

    అదలా ఉంచితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. మొన్నటికి మొన్న పుష్ప ఎక్కడా అంటూ ఓ చిన్నపాటి వీడియోను పుష్ప మూవీ నుండి రిలీజ్ చేసారు.

    ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు లాంటి క్వశ్చన్ ని వేర్ ఈజ్ పుష్ప వీడియో ద్వారా తీసుకురావాలనిన్ ప్రయత్నం చేసారని వినిపించింది.

    పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ట్విట్టర్ ద్వారా దసరా టీం కి అభినందనలు తెలిపిన 

    Big Congratulations to the entire team of #Dasara . Brilliantly made film . Finest performance my brother @NameisNani . Candid performances by @KeerthyOfficial and all the other cast . Wonderful songs & B.Score by @Music_Santhosh garu & excellent camera work by Sathyan garu . The…

    — Allu Arjun (@alluarjun) April 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాని
    అల్లు అర్జున్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నాని

    దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే తెలుగు సినిమా
    దసరా ట్రైలర్: పుష్పతో పోలికపై స్పందించిన నాని సినిమా రిలీజ్
    దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్ దసరా మూవీ
    నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్ సినిమా

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025