
KGF 3: 'కేజీఎఫ్ 3'పై క్రేజీ అప్డేట్.. విడుదల తేదీ కూడా ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ స్టార్ యష్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎంత సెన్సేషన్ సృష్టించాయే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా కేజీఎఫ్ నిర్మాణ సంస్థ నుంచి 'హోంబలే ఫిల్మ్స్' క్రేజీ అప్డేట్ వచ్చింది.
కేజీఎఫ్-3కి ఫ్రాంచైజీకి సంబంధించిన ప్రొడక్షన్ డిసెంబర్ 2023లో ప్రారంభమవుతుందని 'హోంబలే ఫిల్మ్స్' ప్రతినిధి తెలిపారు.
ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగం 2025లో విడుదల అవుతుందని ధృవీకరించారు.
కేజీఎఫ్ విడుదలై డిసెంబర్ 21 నాటికి 5ఏళ్లు అవుతుంది. ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'కేజీఎఫ్ 3' విడుదల ప్రణాళికను అధికారికంగా ప్రకటించనున్నారు.
దర్శకుడు, నిర్మాత మధ్య ప్రాథమిక చర్చలు ఇప్పటికే జరిగినట్లు సమాచారం.
డైకెక్టర్ ప్రస్తుతం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
2025లో సినిమా రిలీజ్
KGF 3 Release BIG Update: Yash To Return As Rocky Bhai In 2025.#KGF3 #KGF2 #KGF #KGFChapter1 #KGFChapter3 https://t.co/u48WzVq5CU pic.twitter.com/Lp9WPos6XD
— TIMES NOW (@TimesNow) September 29, 2023