తదుపరి వార్తా కథనం

కిరణ్ అబ్బవరం కొత్త ఇల్లు చూసారా? ఎక్కడ కట్టుకున్నాడో తెలుసా?
వ్రాసిన వారు
Sriram Pranateja
Sep 28, 2023
06:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
నేనున్నాను సినిమాలోని ఒకానొక పాటలో, తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలనీ అనే లైన్ ఉంటుంది.
ఆ లైన్ హీరో కిరణ్ అబ్బవరంకి బాగా వర్తిస్తుందని చెప్పవచ్చు. వరుసపెట్టి సినిమాలు తీస్తున్న హీరో కిరణ్ అబ్బవరంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.
ఆ ట్రోలింగులను పునాదిగా చేసేసి ఈరోజు హీరో కిరణ్ అబ్బవరం ఏకంగా ఇల్లే కట్టేసాడు. అవును, కిరణ్ అబ్బవరం తన సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు.
ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇంటికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు.
ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడంటే?
ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటీ పెద్దకల్వపల్లెలో సొంతిల్లును కట్టుకున్నాడు. సొంత ఊరిలో ఇల్లు కట్టుకున్న కిరణ్ అబ్బవరంకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కిరణ్ అబ్బవరం ట్వీట్
Where my heart belongs ❤️#Myvillage pic.twitter.com/qYMsnHNBmV
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) September 27, 2023
మీరు పూర్తి చేశారు