Loading...
Korean Kanakaraju: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్‌తేజ్ కొత్త అవతారం.. 'కొరియన్‌ కనకరాజు' టీజర్ విడుదల

Korean Kanakaraju: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్‌తేజ్ కొత్త అవతారం.. 'కొరియన్‌ కనకరాజు' టీజర్ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముక్కుమీద కోపంతో కాకుండా,చేతల్లోనే ఆ ఆవేశాన్ని చూపించే వ్యక్తిగా కనకరాజు పాత్ర కనిపించనుంది. అయితే అతడి జీవితంలోకి ఓ యువతి అడుగుపెట్టిన తర్వాత ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత అందరూ అతడిని'కొరియన్‌ కనకరాజు'అని ఎందుకు పిలవడం ప్రారంభించారు?అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని టీజర్ సూచిస్తోంది. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా,మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న'కొరియన్‌ కనకరాజు' చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్‌తో కలిసి ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాజీవ్‌రెడ్డి,సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రచారంలో భాగంగా సోమవారం ఈ చిత్ర టీజర్‌ను స్టార్ హీరో ప్రభాస్ తన సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.

వివరాలు 

రాయలసీమ యాసలో వరుణ్‌తేజ్సంభాషణలు

"అందరికీ నమస్కారమప్పా... మా ఊరు పెనుగొండ. రాయలసీమ... మా ఊరు ఎంత అందంగా ఉంటుందో, మా జనాలు కూడా అంతే అందంగా ఉంటారప్పా..." అంటూ ప్రారంభమైన టీజర్ మొదటి నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

టీజర్‌లో సరదా కామెడీతో పాటు హారర్ అంశాలను ఆసక్తికరంగా చూపించారు.

గ్రామీణ నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రంలో హాస్యం, హారర్, యాక్షన్, ఫాంటసీ అంశాలను సమతూకంగా మేళవించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కనకరాజు పాత్రలో వరుణ్‌తేజ్ కొత్త లుక్‌లో కనిపించగా, ఆయన రాయలసీమ యాసలో చెప్పే సంభాషణలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, మనోజ్‌రెడ్డి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. సత్య.జి ఎడిటింగ్‌ను చేపట్టారు.

ADVERTISEMENT