Page Loader
ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన
మరణంపై వచ్చిన తప్పుడు వార్తలపై స్పందించిన కోట శ్రీనివాస్ రావు

ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 21, 2023
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు గురించి తెలియని వాళ్ళు లేరు. ఐతే ఈరోజు ఉదయం, ఆయన మరణించారని వార్త బయటకు వచ్చింది. ఈరోజు ఉదయం నుండి ఈ వార్త బాగా చక్కర్లు కొట్టింది. అయితే ఆ వార్త ఫేక్ అని స్వయంగా కోట శ్రీనివాసరావు వెల్లడి చేసారు. ఒక చిన్నపాటి వీడియో రిలీజ్ చేసిన ఆయన, ఈరోజు పొద్దున్నుండి ఆయనకు చాలా కాల్స్ వచ్చాయని, 50కాల్స్ తనే మాట్లాడారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, వాళ్ళింటికి పోలీస్ వ్యాక్ కూడా వచ్చిందట. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం తప్పనీ, తన ఆరోగ్యం బాగానే ఉందనీ ఆయన తెలియజేసాడు. డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయనీ, ఇలా ప్రాణాలతో ఆడుకోవడం సరైన పనికాదని ఆయన అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన