విభిన్న జోనర్లలో థియేటర్లలో ఈ వారం రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు
ప్రతీ శుక్రవారం సినిమా థియేటర్లకు కొత్త కళ వస్తుంది. కానీ ఈ సారి ఆ కళ, కొంత ముందుగానే వచ్చింది. ఉగాది సందర్భంగా థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. దాస్ కా ధమ్కీ: విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, పాన్ ఇండియా లెవెల్లో మార్చ్ 22వ తేదీన రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలక్ నుమా దాస్ తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా ఇదే. రంగమార్తాండ: చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో నుండి వచ్చిన సినిమా. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికా రాజశేఖర్ నటించారు. మార్చ్ 22న రిలీజ్ అవుతుంది.
ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు
కోస్టి: కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో రూపొందిన హార్రర్ కామెడీ చిత్రం, మార్చ్ 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాధికా శరత్ కుమార్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు బాక్సాఫీసు వద్ద ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. గీతసాక్షిగా: ఆదర్శ ఎస్ కేఎన్ఎస్, చిత్రాశుక్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, ఉగాది రోజు రిలీజ్ అవుతుంది. రాజారవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో చేసిన ఈ సినిమాను ఆంటోనీ మట్టిపల్లి డైరెక్ట్ చేసారు. కథ వెనుక కథ: విశ్వాంత్, శ్రీజిత ఘౌష్ నటించిన ఈ చిత్రం, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. మార్చ్ 24వ తేదీన రిలీజ్ అవుతుంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి