
రంగమార్తాండ ట్రైలర్: కట్టుకున్న ఇల్లు, కన్న కూతురు మనవి కావు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రూపొందిన రంగమార్తాండ చిత్ర ట్రైలర్ ఇంతకుముందే రిలీజైంది. నిమిషంన్నర పాటున్న ఈ ట్రైలర్, జీవితంలోని లోతులను ఆవిష్కరించిందని చెప్పవచ్చు.
చుట్టూ ఉన్న సమాజం, పక్కనే ఉండే కుటుంబం కూడా ఎప్పటికీ మనతోనే ఉండదనీ, మనుషుల్లోని అసలు రూపాన్ని చూపే విధంగా సినిమా ఉంటుందని అర్థమవుతోంది.
కుటుంబంలో జరిగిన చిన్న చిన్న గొడవలు పెద్దవై, కుటుంబానికి అమ్మానాన్నలు దూరమయ్యే ఎదురయ్యే పరిస్థితులను రంగమార్తాండలో చూపించినట్లుగా ట్రైలర్ లో అర్థమవుతోంది.
కట్టుకున్న ఇల్లయినా, కన్న కూతురైనా ఒకరికి ఇచ్చేసాక మనవి కావు, ఒంటరిగా పుడతాం, ఏకాకిలా పోతాం, మధ్యలో అంతా నాటకం అన్న డైలాగులు, సినిమాలో చాలా బరువైన భావోద్వేగం ఉందని తెలియజేస్తున్నాయి.
రంగమార్తాండ ట్రైలర్
హైలైట్ అవుతున్న బ్రహ్మానందం
మొన్న రిలీజ్ చేసిన టీజర్ మాదిరిగానే ట్రైలర్ లోనూ బ్రహ్మానందం హైలైట్ గా నిలిచారు. ఆయన పలికిన డైలాగులు కూడా బాగున్నాయి. సినిమాలోనూ ఆయనే హైలైట్ అయ్యే అవకాశం ఉందని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది.
ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఇదివరకే వేసారన్న సంగతి తెలిసిందే. ప్రఖ్యాత దర్శకులు, సెలెబ్రిటీలు ఈ సినిమాను ఆల్రెడీ చూసేసారు. సినిమా బాగుందని పొగడ్తలు కూడా ఇచ్చారు.
ఇందులో అనసూయ భరధ్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా.. ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని, మార్చ్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈసారైనా కృష్ణవంశీకి సరైన విజయం దక్కుతుందేమో చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రంగమార్తాండ ట్రైలర్ విడుదల
Presenting the soulful #RangamarthandaTrailer
— Krishna Vamsi (@director_kv) March 20, 2023
- https://t.co/wD8QBLLFjk
ఉగాది శుభాకాంక్షలతో, మార్చి 22న థియేటర్లలో రంగమార్తాండ విడుదల ❤️#Rangamarthanda @ilaiyaraaja @PRAKASHRAAJ @MERAMYAKRISHNAN #BRAHMANANDAM @RajaShyamalaEnt @MythriOfficial @SillyMonksMusic pic.twitter.com/C2dBqBi0Tg