రంగమార్తాండ టీజర్: కొత్తగా కనిపించే బ్రహ్మానందం
తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ ఎందరో దర్శకుల్లో కృష్ణవంశీ కూడా ఒకరు. ఆయన సినిమాలు మన కళ్ళ ముందు జరుగుతున్న కథల్లాగే కనిపిస్తుంటాయి. అందుకే క్రియేటివ్ డైరెక్టర్ అయ్యారు. అప్పట్లో వచ్చిన గులాబీ తీసుకున్నా, ఖడ్గం తీసుకున్నా, మురారి తీసుకున్నా, ప్రతీ సినిమాకు ఒక గొప్పదనం ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, తాజాగా కృష్ణవంశీ నుండి కొత్త సినిమా వస్తోంది. చాలా రోజుల తర్వాత తన సినిమాను ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమయ్యారు క్రిష్ణవంశీ. రంగమార్తాండ పేరుతో తెరకెక్కినఈ చిత్ర టీజర్ ఈరోజే విడుదలైంది. ఈ టీజర్ లో సినిమాకు సంబంధించిన అంశాలు పెద్దగా రివీల్ చేయలేదు కానీ బ్రహ్మానందం మాత్రం కొత్తగా కనిపించారు.
ప్రీమియర్ షోస్ తో బయటకు వచ్చేసిన రంగమార్తాండ టాక్
నటసామ్రాట్ పేరుతో రూపొందిన మరాఠీ చిత్రాన్ని తెలుగులో రంగమార్తాండ గా రీమేక్ చేసారు. ఇందులో ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యక్రిష్ణ, తనికెళ్ళ భరణి, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్ష్ నటిస్తున్నారు. పైన చెప్పిన పాత్రలను టీజర్ లో పరిచయం చేసారు. ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందాన్ని ఈ సినిమాలో సీరియస్ గా చూస్తామని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. నాటకరంగం గురించి ఈ సినిమా ఉంటుందని అందరికీ తెలిసిందే. అదలా ఉంచితే, ఈ సినిమాను ఇప్పటికే చాలామందికి ప్రీమియర్ వేసారు. దాదాపు తెలుగు సినిమా దర్శకులు ఈ సినిమాను చూసారు, కృష్ణవంశీ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఉగాది సందర్భంగా మార్చ్ 22వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.