
చిరంజీవి భోళాశంకర్ సినిమాలో లవర్ బాయ్ గా సుశాంత్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా నుండి కత్తిలాంటి అప్డేట్ వచ్చింది. అక్కినేని సుశాంత్, ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నట్లు భోళాశంకర్ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
సుశాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని, శుభాకాంక్షలు తెలియజేస్తూ, భోళాశంకర్ చిత్రంలో లవర్ బోయ్ గా సుశాంత్ కనిపిస్తాడని ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో గోల్డెన్ కలర్ సూట్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.
ఇక భోళాశంకర్ విషయానికి వస్తే, చిరంజీవి సరసన తమన్నా భాటియా నటిస్తోంది. చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపిస్తుంది.
మెహెర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ మూవీని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, క్రియేటివ్ కమర్షియల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ చిత్రంలో అక్కినేని సుశాంత్
The #BholaaShankar family wishes the charming @iamSushanthA a very Happy Birthday❤️
— BholāShankar (@BholaaShankar) March 18, 2023
The whole team is elated to have him aboard to play a Lover boy in a very special role🤗
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial pic.twitter.com/O4GAL4EJSy