పొన్నంబాలం: సొంత కుటుంబమే విషమిచ్చి చంపాలని చూసింది
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ నటుడు పొన్నంబాలం, చిరంజీవి తనకు చేసిన సాయాన్ని గురించి అందరితో చెప్పుకొచ్చారు. తన కిడ్నీలు రెండు ఫెయిల్ అవడంతో, ఎవరిని సాయమడగాలో తెలియట్లేదట.
అలా ఆలోచిస్తుండగా మెగాస్టార్ చిరంజీవి పేరు అతనికి గుర్తొచ్చిందట. వెంటనే చిరంజీవికి కాల్ చేసి విషయం మొత్తం చెప్పాడట పొన్నంబాలం. చిరంజీవి నుండి లక్షా లేదా రెండు లక్షల రూపాయలు సాయం వస్తుందని పొన్నంబాలం అనుకున్నారట.
కానీ చిరంజీవి ఫోన్ చేసి, చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లామని చెప్పారట. అలాగే వెళ్ళిన పొన్నంబాలం, అక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్నారు.
కనీసం ఒక్కరూపాయి కూడా ఆసుపత్రి వాళ్ళు అడగలేదట. మొత్తం ఆసుపత్రి బిల్ 40లక్షలు అయ్యిందట. అదంతా చిరంజీవే చూసుకున్నారని పొన్నంబాలం అన్నాడు.
పొన్నంబాలం
తినే తిండిలో విషం ఎక్కించి మెల్లగా ప్రాణాలు తీద్దామనుకున్న కుటుంబం
పొన్నంబాలం రెండు కిడ్నీలు పాడవడానికి ముఖ్య కారణం, విష పదార్థాలు కలిగి ఉన్న ఆహారం తినడమే అని తనే చెప్పుకొచ్చాడు. సొంత కుటుంబం వాళ్లే తనను చంపాలని చూసారనీ అన్నాడు.
పొన్నంబాలం తండ్రికి నలుగురు భార్యలు. అందులోని మూడవ భార్య కొడుకు, పొన్నంబాలం మేనేజర్ గా ఉండేవాడు. అతనే పొన్నంబాలం చనిపోవాలని అనుకున్నాడు.
అందుకే తినే తిండిలో, తాగే నీళ్ళలో విషం ఎక్కించి ఇచ్చేవాడట. అలా విష పదార్థాల వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పుకొచ్చాడూ.
తమిళ నటుడైన పొన్నంబాలం, తెలుగు సినిమాలైన ఘరానా మొగుడు, మెకానిక్ అల్లుడు, అల్లరి ప్రియుడు వంటి చిత్రాల్లో విలన్ గా నటించి, తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.