Page Loader
రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. గర్వపడ్డ చిరంజీవి
జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసపై అనందం వ్యక్తం చేసిన చిరంజీవి

రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. గర్వపడ్డ చిరంజీవి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 18, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ మరోసారి ఆర్ఆర్ఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ పాత్ర అమోఘమంటూ కితాబు ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా చరణ్ పోషించిన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ ప్రముఖులు ఎంతోమంది రాంచరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి వచ్చిన నాటు నాటుపాట ఆస్కార్ బరిలో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామచరణ్ నటించిన సీతారామరాజు పాత్ర తనకు ఎంతో నచ్చిదంటూ హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ చెప్పాడు.

రాంచరణ్

సంతోషాన్ని అభిమానులతో పంచుకున్న చిరంజీవి

ఈ నేపథ్యంలో జేమ్స్ కామెరాన్ స్పందించడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. జేమ్స్ కామెరాన్ సర్.. మీ అంతటి సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదని చిరంజీవి ట్విట్ చేశారు. రామ్ చరణ్ ఈ స్థాయిలో ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా ఉందన్నారు. మీ ప్రశంసలు రామ్ చరణ్ భవిష్యతు సినిమాలకు దీవెనలు అని చెప్పారు. అయితే మార్చి 12న ఆస్కార్ విజేతలను ప్రకటించనున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ ను జయించాలని అభిమానులు కోరుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చరణ్ రోల్ కి కేమరూన్ వ్యాఖ్యలపై చిరు ఎమోషనల్ రియాక్షన్