
అందాల రాక్షసి కోసం వస్తున్న మెగా హీరో రామ్ చరణ్
ఈ వార్తాకథనం ఏంటి
అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ప్రవేశించిన లావణ్య త్రిపాఠి, ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అవకాశాలు వచ్చినా కూడా సినిమాలు వర్కౌట్ కాలేదు.
ఐతే ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది లావణ్య త్రిపాఠి. పులి మేక అనే వెబ్ సిరీస్ తో వస్తుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా అలరించడానికి రెడీ అవుతోంది లావణ్య.
ఈ వెబ్ సిరీస్ లో హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సిరీస్ నుండి, గ్లింప్స్ విడుదల చేయడానికి మెగా హీరో రామ్ చరణ్ వచ్చేస్తున్నారు.
రామ్ చరణ్
సినిమాలతో అందని విజయం సిరీస్ తో దక్కుతుందా?
ఫిబ్రవరి 17వ తేదీన మద్యాహ్నం 12గంటలకు పులి మేక వెబ్ సిరీస్ గ్లింప్స్, విడుదల చేయనున్నాడు రామ్ చరణ్.
జీ5, కోన ఫిలిమ్స్ కార్పోరేషన్స్ సంయుక్తంగా పులి మేక సిరీస్ ను నిర్మించాయి. గ్లింప్స్ విడుదలతే ఈ సిరీస్ ఎలాంటి కంటెంట్ తో వస్తుందనేది అర్థమవుతుంది.
ప్రస్తుతానికి ఇదొక క్రైమ్ డ్రామా అని చెప్పుకుంటున్నారు. సినిమా టైటిల్ కూడా క్రైమ్ డ్రామాను సూచిస్తున్నట్టుగా ఉంది.
గోపీచంద్ హీరోగా వచ్చిన పంతం సినిమాకు దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి, పులి మేక సిరీస్ ను డైరెక్ట్ చేసారు. ఫిబ్రవరి 24వ తేదీ నుండి జీ5లో ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది.
ఈ సిరీస్ తో అందాల రాక్షసికి సక్సెస్ అందుతుందేమో చూడాలి.