రామ్ చరణ్ 15వ సినిమా: షూటింగ్ సెట్ లోంచి మళ్ళీ లీకైన ఫోటోలు
రామ్ చరణ్ 15 సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి. ఈమధ్య షూటింగ్ సెట్లోంచి లీకైన ఫోటోలు ఆ అంచనాలను మరింత పెంచాయి. రాజకీయ నాయకుడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తున్నట్టు ఆ ఫోటోల ద్వారా అర్థమైంది. అయితే అది సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అనీ, సినిమాకి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అదే ఉంటుందని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. అదలా ఉంచితే, తాజాగా షూటింగ్ సెట్లోంచి మరికొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలో రామ్ చరణ్ ని చూసిన వాళ్ళందరూ వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. సినిమా కోసం చరణ్ మారిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు.
షూటింగ్ సెట్లో రామ్ చరణ్ ని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే
ఆ ఫోటోలు బయటకు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గంట ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగానే రామ్ చరణ్ 15వ సినిమా షూటింగ్ సెట్ లోకి గంటా శ్రీనివాసరావు అడుగు పెట్టారు. అక్కడ చరణ్ ని, దర్శకుడు శంకర్ ని కలిసి బొకే అందజేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలో రామ్ చరణ్ ని చూసిన వారందరూ ధృవ సినిమాలో మాదిరిగా కనిపిస్తున్నాడని అంటున్నారు. లీక్ అవుతున్న ఫోటోల ద్వారానే రామ్ చరణ్ 15వ సినిమాకు హైపు పెరిగిపోతోంది. మరి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.