LOADING...
This week telugu movies: మార్చి లాస్ట్ వీక్ స్పెషల్.. శ్రీరామనవమి కానుకగా రాబోతున్న సినిమాలివే!
మార్చి లాస్ట్ వీక్ స్పెషల్.. శ్రీరామనవమి కానుకగా రాబోతున్న సినిమాలివే!

This week telugu movies: మార్చి లాస్ట్ వీక్ స్పెషల్.. శ్రీరామనవమి కానుకగా రాబోతున్న సినిమాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. ప్రేమకథల నుంచి సైకాలజికల్ థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైనర్‌ల వరకు విభిన్న జానర్లలో సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. 'బ్యాండ్‌ మేళం'-బావ మరదల ప్రేమకథ 'కోర్ట్‌' విజయానంతరం నటుడు రోషన్, నటి శ్రీదేవి కలిసి నటించిన రెండో చిత్రం బ్యాండ్ మేళం. కోన వెంకట్ నిర్మాణంలో సతీశ్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. కావ్య, శ్రావ్య నిర్మాతలు కాగా సాయికుమార్ కీలక పాత్ర పోషించారు. శ్రీరామ నవమి కానుకగా మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. టీనేజ్‌లో ఉన్న బావ-మరదల ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో హీరో తన ప్రేమను సాధించేందుకు ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని ఎలా అధిగమించాడు అన్నదే కథాంశం.

వివరాలు

'సుయోధన' - సైకాలజికల్ థ్రిల్లర్

నటుడు ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన సుయోధన సైకాలజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించగా, బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ చిత్రంలో సాయికుమార్, ప్రేమ కీలక పాత్రలు పోషించారు. మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వ్యక్తిని సుయోధన లేదా దుర్యోధనగా ఎందుకు పిలుస్తారు అన్న అంశాన్ని ఆసక్తికరంగా చూపించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

వివరాలు

'గోట్‌' - క్రికెట్ కామెడీ ఎంటర్టైనర్

సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో నటించిన గోట్ (G.O.A.T) చిత్రాన్ని వేదవ్యాస్ తెరకెక్కించారు. ఎం. చంద్రశేఖర్ నిర్మించారు. మార్చి 26న విడుదల కానున్న ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో కామెడీ ప్రధానంగా సాగుతుంది. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యువతను ఆలోచింపజేసే సందేశం కూడా ఇందులో ఉండనుందని చిత్రబృందం చెబుతోంది.

Advertisement

వివరాలు

'యూత్‌' - యువతను ఆకట్టుకునే కథ

నటుడు కరుణాస్ తనయుడు కెన్ కరుణాస్ దర్శకత్వం వహిస్తూ హీరోగా పరిచయమవుతున్న చిత్రం యూత్. దేవదర్శిని, సురాజ్ వెంజరమూడు ముఖ్యపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. పాఠశాల నేపథ్యంలో రూపొందిన ఈ తమిళ చిత్రం తెలుగులో మార్చి 26న విడుదల కానుంది. నేటి యువతను ఆకట్టుకునే అంశాలతో సినిమాను రూపొందించారు. 'హ్యాపీ రాజ్‌' - వినోదభరిత కమర్షియల్ చిత్రం జీవీ ప్రకాశ్, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన హ్యాపీ రాజ్ చిత్రానికి మరియా రాజా ఎలాంచెళియన్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ప్రేమదేశం' ఫేమ్ అబ్బాస్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం ప్రత్యేకత. వినోదంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

వివరాలు

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌ ది రెడ్‌ లైన్‌ (ఇంగ్లీష్‌) మార్చి 26 మర్దానీ3 (హిందీ) మార్చి 27 అమెజాన్‌ ప్రైమ్‌ ప్రెటీ లేథల్‌ (మూవీ) మార్చి 25 బైట్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 25 జియో హాట్‌స్టార్‌ ది కమ్‌బ్యాక్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 23 డేర్‌ డెవిల్‌ బోర్న్‌ అగైన్‌ 2 (వెబ్‌సిరీస్‌) మార్చి 24 కాట్టాన్‌ (తమిళం) మార్చి 27

Advertisement