
వరుణ్ తేజ్ తో పెళ్ళి పుకార్ల పై స్పందించిన లావణ్య త్రిపాఠి
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా తారల మీద పుకార్లు రావడం సహజమే. స్టార్ స్టేటస్ పెరిగే కొద్దీ ఈ పుకార్లు కూడా పెరుగుతుంటాయి. గత కొంత కాలంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్ళి గురించి చాలా పుకార్లు బయటకు వచ్చాయి.
మరికొద్ది రోజుల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళిచేసుకోబోతున్నారని అన్నారు. తాజాగా ఈ విషయాలపై లావణ్య త్రిపాఠి స్పందించింది.
ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తో పెళ్ళి వార్తలపై ఏమంటారని అడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేసింది.
జనాలకు నా పెళ్ళి మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో పదేళ్ళుగా ఉంటున్నాను కాబట్టి నేను పెళ్ళి చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారని ఆమె అంది.
లావణ్య త్రిపాఠి
తల్లిదండ్రులు స్వేచ్చనూ ఇచ్చారంటున్న లావణ్య
పెళ్ళనేది జరిగే టైమ్ లో జరుగుతుందని, దాని గురించే ఆలోచిస్తూ నేను కూర్చోలేనని, తన తల్లిదండ్రులు, తన పెళ్ళి విషయంలో పూర్తి స్వేఛ్ఛనిచ్చారని, వాళ్ళెప్పుడూ పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేయలేదని అందాల రాక్షసి హీరోయిన్ అంది.
మరి పెళ్ళి ఆలోచన ఎప్పుడు ఉందని అడగ్గా, ఇప్పట్లో లేదనీ, ప్రస్తుతానికి ఫోకస్ అంతా సినిమాల మీదే ఉందని, పెళ్ళెలా చేసుకోవాలనే విషయంలోనూ తనకెలాంటి ఆలోచన లేదనీ లావణ్య త్రిపాఠి పేర్కొంది.
లావణ్య త్రిపాఠి నటించిన పులి మేక వెబ్ సిరీస్ జీ 5 లో అందుబాటులో ఉంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది లావణ్య. పులి మేక సిరీస్ లో ఆది సాయి కుమార్ హీరోగా కనిపించారు.