నాజర్ బర్త్ డే: దక్షిణాది సినిమాల్లో చెరగని ముద్రవేసిన నాజర్ జీవితంలో మీకు తెలియని విషయాలు
నాజర్... పాత్రేదైనా ఆ పాత్రకు కొత్తదనాన్ని తీసుకొచ్చే నటుడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోకు సపోర్ట్ ఇస్తాడు. అలాగే విలన్ గా హీరోను ఎదిరిస్తాడు. అంతేకాదు, కమెడియన్ గా మారి ప్రేక్షకులను నవ్విస్తాడు కూడా. ఒక యాక్టర్ ఇన్ని రకాలుగా కనిపించడం చాలా తక్కువ మందిలో జరుగుతుంటుంది. ఆ విషయంలో నాజర్ గొప్ప అని చెప్పక తప్పదు. ఈరోజు నాజర్ బర్త్ డే. 1958లో తమిళనాడూలో జన్మించిన నాజర్, నేటితో 65వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెయిటర్ గా పనిచేసిన నాజర్: నటుడిగా మారకముందు హోటల్ లో వెయిటర్ గా పనిచేసారు నాజర్. బ్రతుకు జీవనం సాగించడానికి రకరకాల పనులు చేసారు నాజర్.
యాక్టర్ మారడానికి కారణమైన నాజర్ నాన్న
నాజర్ యాక్టర్ గా మారాలని వాళ్ళ నాన్న మహబూబ్ పాషా అనుకున్నారట. యాక్టింగ్ అంటే ఆసక్తి ఉందని నాజర్ చెప్పినపుడు చాలా ప్రోత్సహించారట. నాజర్ ముక్కు మీద విమర్శలు: మొదట్లో నాజర్ ముక్కు మీద, నుదురు మీదా చాలా విమర్శలు వచ్చాయి. అయినా కూడా తన యాక్టింగ్ లో అవేమీ కనిపించనివ్వకుండా కేవలం పాత్రను మాత్రమే కనిపించేలా చేసాడు నాజర్. కమల్ హాసన్ తో స్నేహం: నాజర్ కి కమల్ హాసన్ కి మంచి స్నేహం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేసారు. ఉత్తమ విలన్ సినిమా సమయంలో నాజర్ కొడుక్కి యాక్సిడెంట్ జరిగినపుడు షూటింగ్ క్యాన్సిల్ చేసాడు కమల్ హాసన్. అది వీరి స్నేహానికి నిదర్శనం.